2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి ఏది కలిసి రావడం లేదు. ఆ ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయి టి‌డి‌పి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ప్రతిపక్షానికి పరిమితమైన సరే ఎలాగైనా పార్టీని పైకి తీసుకురావాలని చంద్రబాబు పనిచేస్తున్నారు. అటు లోకేష్ కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు. అధికార వైసీపీపై నిత్యం పోరాడుతున్నారు. ఓ వైపు పార్టీ నేతలని యాక్టివ్ చేసుకుంటూ, మరోవైపు వైసీపీ నుంచి నేతలని, కార్యకర్తలని కాపాడుకుంటూ ముందుకెళుతున్నారు.

ఇలా అన్నిరకాలుగా కష్టపడుతున్నా కూడా టి‌డి‌పికి ఏది కలిసి రావడం లేదు. పంచాయితీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. తిరుపతి ఉపఎన్నికలో చిత్తు అయింది. తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కాకపోతే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ముందే ప్రకటించారు.

ఇలా ముందే బరిలో నుంచి తప్పుకోవడం చంద్రబాబు చేసిన బిగ్ మిస్టేక్‌లా కనిపిస్తోంది. పంచాయితీ, మున్సిపాలిటీ, తిరుపతి ఎన్నికలో ఓటమి ఎదురైనా సరే అక్కడ వైసీపీ కుట్రలకు ధీటుగా నిలబడి పోరాడారు. కానీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చేతులెత్తేశారు. అసలు ముందే నామినేషన్స్ వేసి ఉన్నప్పుడు ఇలా బహిష్కరించడం అనే నిర్ణయం కరెక్ట్ కాదని టి‌డి‌పి నేతలే భావించారు. ఒకవేళ నామినేషన్స్ వేయకుండా ఉంటే సరిపోయేది...కానీ గతంలోనే నామినేషన్ ప్రక్రియ జరిగిపోయింది.

అలాంటప్పుడు పోయేది ఏం లేదని పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చేవని కొందరు తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. మరీ ఇలా వైసీపీకి విజయాలు కూడా దక్కేవి కాదని అంటున్నారు. ఎన్నికలని బహిష్కరించినా సరే చాలా చోట్ల టి‌డి‌పి వాళ్ళు, వైసీపీకి పోటీ ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల సత్తా చాటారు కూడా. అలాంటప్పుడు బహిష్కరణ అనే పదం లేకుండా ముందుకెళితే బాగుండేది అని, అప్పుడు వైసీపీకి కాస్త పోటీ వచ్చేదాని తమ్ముళ్ళు మాట్లాడకుంటున్నారు. ఏదేమైనా బాబు ఎన్నికలని బహిష్కరించకుండా ఉండాల్సింది అని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: