ఏపీ సీఎం జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఉత్త‌రాంధ్ర లో పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆ పార్టీ రాజ్య‌స‌భ సభ్యుడు విజ‌య‌సాయి రెడ్డికి అప్ప‌గించారు. ఆయ‌న పార్టీ కోసం బాగా ప‌ని చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డ‌డంతోనే పార్టీ అక్క‌డ ఫిక‌ప్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ న‌గ‌రంలోని నాలుగు సీట్లు ఇక శ్రీకాకుళం జిల్లాలోని రెండు ఎమ్మెల్యే సీట్లు.. అటు శ్రీకాకుళం ఎంపీ సీటు మిన‌హా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది.

అయితే ఇప్పుడు మూడు జిల్లాల‌కు విజ‌య‌సాయే ఇన్‌చార్జ్ గా ఉండ‌డంతో అక్క‌డ పార్టీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న బాగానే ప‌ని చేస్తున్నా నాన్ లోక‌ల్ కార్డు ఆయ‌న‌కు మైన‌స్ అవుతోంది. మ‌రో వైపు ఆయ‌న విశాఖ‌లో స్థానిక పార్టీ నాయ‌కుల‌పై డామినేష‌న్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక టీడీపీ వాళ్లు అయితే విజ‌య‌సాయి ఎక్కడ నుంచో వచ్చి విశాఖలో దందాలు చేస్తున్నారంటూ ఘాటుగానే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఇక వైసీపీ సీనియ‌ర్ల‌లో కూడా స్థానికంగా ఆలోచ‌న అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్క‌డ స్థానిక నేత‌లు చాలా మంది ఉండ‌గా.. త‌మ‌కు ఎందుకు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్నారు. అక్క‌డ ప‌రిస్థితిని గ్ర‌హించిన జ‌గ‌న్ విజ‌య‌సాయి ని ఉత్త‌రాంధ్ర పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌సాయిని త‌ప్పించేసి ఈ ప్లేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధ‌ర్మాన కృష్ణ దాస్‌కు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని అంటున్నారు.

ఆయ‌న నాన్ కాంట్ర‌వ‌ర్సీ ప‌ర్స‌న్‌. అంద‌రిని క‌లుపుకుని పోతూ ఉంటారు. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను ఒక్క‌టి చేసి ఒకే నేత‌కు పార్టీ ప‌ద‌వి అప్ప‌గించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. మ‌రి ఈ విష‌యంలో కృష్ణ దాస్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: