హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి అందరికీ విధి తమే.  హుజరాబాద్ ఉప ఎన్నిక ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్సెస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మారిపోయింది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికను అటు ఈటల రాజేందర్ ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఇంకా గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈటల రాజేందర్... పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. అంతేకా కుండా...  ఉద్యమ కాలాన్ని గుర్తుచేస్తూ సెంటిమెంటును ప్రజల్లో నింపుతున్నారు. 

ఇంకా అటు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ కు ధీటుగా బీసీ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో బిసి ఓట్లు ఈటల రాజేందర్ కు గంపగుత్తగా పడకుండా... చీలె చాన్స్ లు ఉన్నాయి. అలాగే ఎక్కువగా దళితులు ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో.... దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఈ పథకం ద్వారా 35 వేల ఓట్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న... రైతుబంధు, కల్యాణ లక్ష్మి, మరియు ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాల కారణంగా... మరి కొన్ని ఓట్లు టీఆర్ఎస్ కే పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  అలాగే టిఆర్ఎస్ పార్టీ జెండాను చూసి కూడా కొంత మంది ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలుపు సులభమవుతుందని చర్చ సాగుతోంది. దీంతో ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గం లో   ఎదురుగాలి తప్పదని అందరూ భావిస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ఈటల రాజేందర్ ఎలా ఎదుర్కొంటాడు అనేది తేలాల్సి ఉంది. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక  నోటఫికేషన్ దీపావళి తర్వాత వస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: