నరేంద్ర మోడీని నమ్ముకోవద్దు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని నమ్ముకోవద్దు. ఆయన వల్ల ఏమీ ఫలితం ఉండదు. ఈ వ్యాఖ్యలు చేసింది  దేశంలోని ఏ ప్రతి పక్షనేతో కాదు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రతిపక్షనేతో కాదు.  భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ప్రధాన  మంత్రి పై  ఈ వ్యాఖ్యలు చేశారు. అదీ  బి.జె.పి రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో.  కర్ణాటక సి.ఎం. బొమ్మై హాజరైన ఈ సమావేశంలో తాజా మాజీ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దావణగారెలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంనుంచి పులువురు ఆ పార్టీ నేతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ తన దైన శైలిలో నరేంద్ర మోడీ పై సునిశితంగా విమర్శలు చేశారు. కర్ణాటక రాష్ట్ర శాసన సభా సమావేశాలకు హజరైన యడ్యూరప్ప వెనుక బెంచీలో కూర్చోని ఆందరిని ఆశ్చర్య పరిచారు. తాను సాధారణ సభ్యుడనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలనను పరిశీలిస్తుంటానని కూడా ఆయన ఆ సందర్భంగా అన్నారు. తాజా గా భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో ఏకంగా ప్రధాన మంత్రి పైనే వ్యాఖ్యలు చేశారు. యడ్యురప్ప ప్రసంగిస్తున్నప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. కాగా కొద్ది సేపట్లోనే ఆయన సర్దుకున్నారు. తన ప్రసంగంలో స్వరం మార్చారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రమే మోడీ హవా ఉంటుందనేది తన అభిప్రాయమన్నారు. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని వాటిల్లో బి.జె,పి, అభ్యర్దులు ఘన విజయం చేకూర్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలను సూచించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు అబివృద్ధి ప్రాతిపదిక జరుగుతాయన్నారు. కర్ణాటకలో బి.జె.పి చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకు వెళ్లి వివరించాలని యడ్యూరప్ప కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉందన్న విషయాన్ని మరచిపోవద్దని కార్యకర్తలకు హితవు చెప్పారు. వచ్చే శాసన సభ ఎన్నికలలోనూ బి.జే.పికి అఖండ విజయం చేకూర్చక పోతో మనుగడ సన్నగిల్లుతుందని యడ్యూరప్ప తెలిపారు.
సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి  బొమ్మై నంజనగూడులో దేవస్థాన కూల్చివేత తొందర పాటు చర్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల  పరిరక్షణకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: