ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గా కొనసాగుతుంది గూగుల్ సంస్థ. అయితే టెక్ దిగ్గజం గా కొనసాగుతున్న గూగుల్ సంస్థ రెండవ అతి పెద్ద మార్కెట్ ఏది అంటే అది భారత్ అని చెప్పుకోవచ్చు. అయితే భారత్లో గూగుల్ సంస్థ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని అంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వినిపిస్తూ ఉండటం  సంచలనంగా మారిపోయింది  . గత రెండేళ్ల క్రితం ఈ ఆరోపణలు వినిపించగా అప్పటినుంచి దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే గూగుల్ పై వచ్చిన ఈ ఆరోపణలు నిజమే అంటూ అటు దర్యాప్తు ఏజెన్సీ తేల్చింది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో గూగుల్ పై తీసుకునే చర్యల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 ప్రస్తుతం యాప్ మార్కెటింగ్ రంగం లోనే గూగుల్ కు భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ గా కొనసాగుతుంది. అలాంటి భారత్ లో అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది అంటూ ఆరోపణలు రావడం సంచలనం గా మారిపోయింది. ఇక గూగుల్ పై ఆరోపణలు రాగానే వెంటనే యాపిల్ అమెజాన్ సంస్థలకు కూడా ఇలాంటి ఆరోపణలు చుట్టుముట్టాయి  ఈక్రమంలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. యాప్ మార్కెటింగ్లో ఇతరులకు స్థానం కల్పించకుండా గూగుల్ లాభపడింది అని గూగుల్ పై ఆరోపణలు రాగా . ఇది చట్ట ప్రకారం నేరం. ఈ క్రమంలోనే సిసిఐ 2019లో దర్యాప్తు ప్రారంభించగా ఇటీవల ఈ దర్యాప్తు పూర్తయింది



 ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ సి సి ఐ తేల్చింది. ఈ క్రమంలోనే గూగుల్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాము అన్న విషయంపై త్వరలో ప్రకటన చేస్తాము అంటూ స్పష్టం చేసింది. అయితే గూగుల్ పై ఆరోపణలు నిజం కావడంతో అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. అదే సమయంలో ఈ యాప్ మార్కెటింగ్ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం లాంటిది అటు భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతుంది ఏ డి ఐ ఎఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: