గత రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రానురాను రాజకీయంగా దిగజారిపోతోంది. కనీస విలువలు పాటించకుండా అధికారం కోసం ఎంత ఎత్తైనా వేస్తుంది. దీనివలన ఆ పార్టీకి కొందరు మహానుభావుల వలన వచ్చిన మంచి పేరు కాస్త ప్రస్తుత నాయకత్వంలో దిగజారిపోతోంది. కర్ణాటక నుండి త్రిపుర వరకు అధికారం కోసం వాళ్ళు చేయని పని లేదు. కుదిరితే కుటిల రాజకీయాలు లేకపోతే ఆయా వర్గాల మధ్య ఘర్షణలు రేపి వాళ్ళు ప్రయోజనాన్ని పొందటం ప్రస్తుత నాయకత్వం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ స్థితిని చూసి బీజేపీపై రానురాను ప్రజలలో విముఖత ఏర్పడుతున్నప్పటికీ సరైన విపక్షం లేకపోవడంతో ప్రజలు కూడా ఈ పార్టీనే దిక్కవుతుంది.

దీనిని చూసి తాము ఏమి చేసినా ప్రజలకు నచ్చుతామేమో అనే అపోహలో బీజేపీ ఉంది. మళ్ళీ ఒక్కసారి విపక్షాలు బలంగా తయారైతే బీజేపీ కి చావుదెబ్బ తప్పదు అనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఈ స్థితి వచ్చే వరకు బీజేపీ తెచ్చుకోకుండా తన తీరు మార్చుకుంటే మరింత కాలం అధికారంలో ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. ఇక ఉప ఎన్నికలలో కూడా బీజేపీ తీరు మారడం లేదు, ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిపై సవతితల్లి ప్రేమ కురిపిస్తుంది కేంద్రం. అసలు కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సింది పోయి, తమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ పోవడం సరైనది కాదని అంటున్నారు.

తాజాగా ఓ నివేదిక ప్రకారం బీజేపీ అధికారంలోకి రాకముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న త్రిపుర ఇప్పుడు హింసతోనే రోజు తెల్లవారుతుండటం చూస్తుంది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ నేపథ్యంతో నేరాలు(హత్యలు, భూకబ్జాలు, కిడ్నాప్ తదితరాలు) విపరీతంగా పెరిగినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. త్రిపుర లో ప్రతి లక్ష జనాభా 0.5 శాతం మంది రాజకీయ దాడులకు గురి అవుతున్నారని ఈ నివేదిక తెలిపింది. ఆ తరువాత స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లు ఉన్నాయి. ఇక్కడ జరిగినన్ని రాజకీయ ప్రేరేపిత నేరాలు మరెక్కడా జరగకపోవడం విశేషం. గతేడాది ఒక్క త్రిపుర లోనే రాజకీయ నేపథ్యం ఉన్న గొడవలు 22 జరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: