వినాయక నిమజ్జనం విషయంలో భక్తులు చాలా ఇష్టంగా పాల్గొంటారు. పోలీసులు కూడా ఉత్సవాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇక హైదరాబాద్ మూడు కమీషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం పూర్తి అవుతుంది అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూకట్ పల్లి ఐడీఎల్ ట్యాంక్ తో పాటు పలు చెరువులను సందర్శించి భద్రతను సమీక్షించిన సైబరాబాద్ సీపీ... ఆ తర్వాత మీడియాతో మాట్లాడి వివరాలు పంచుకున్నారు.

ప్రధానంగా జిహెచ్ఎంసి ఆర్అండ్ బీ, ట్రాన్స్ కో, ట్రాన్స్ పోర్ట్, హెల్త్ డిపార్ట్మెంట్ లతో కలిసి అన్ని ఏర్పాట్లు చేశాము అని ఆయన తెలిపారు. ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున నిమజ్జనంతో పాల్గొనడం సంతోషంగా ఉంది అని ఆయన హర్షం వ్యక్తం చేసారు. సైబరాబాద్ లో భద్రతకు సంబంధించి 7000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం అని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఈ సంవత్సరం 9000 గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పటికే 7000 గణేష్ విగ్రహాలు నిమజ్జనమయ్యాయి అని ఆయన వివరించారు. సోమవారం, మంగళవారం కలిపి మరో 2500 నుంచి 3000 గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాము అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి అని విజ్ఞప్తి చేసారు. ఏదైనా సమస్య ఉంటే డయల్ 100 కు ఫిర్యాదు చేయాలి అని విజ్ఞప్తి చేసారు. రెండో రోజు కూడా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ , ఎన్టీఆర్ ఘాట్, పివి మార్గ్ లో పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి అని తెలిపారు .ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు పేర్కొన్నారు. 24గంటలు గడుస్తున్నా సరే ఇంకా నిమజ్జనాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts