జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత సిఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటూ ప్రసంగం మొదలుపెట్టిన సిఎం వైఎస్ జగన్... పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు; శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు ఇచ్చిన ఈ విజయం, అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింతగా పెంచాయి అని జగన్ హర్షం వ్యక్తం చేసారు.

ఈరోజు ఎన్నికల తేదీ నుంచి కూడా ఒక్కసారి గమనించినట్లైతే, 2019 ఎన్నికల్లో అక్షరాలా 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 స్థానాలు, అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంటు సీట్లతో.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైంది అని అన్నారు ఆయన. తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అంటూ... ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి, అక్షరాలా 13,081 పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీలు.. అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో పార్టీ మద్దతుదారులను దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అని ఆయన గుర్తు చేసారు.

దాని తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయన్నారు ఆయన. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు... ఏకంగా 75కు 74 చోట్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం అని ఆయన చెప్పుకొచ్చారు. 12 చోట్ల మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి అని... 12కు 12.. 100 శాతంతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది అని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: