ధ‌ర్మాన కృష్ణ దాసు, అయ్య‌న్న పాత్రుడు ఎప్పుడైనా ఎదుర‌య్యారా? ఏమో! మ‌రి! ఎప్పుడ‌యినా ఏ వివాదంలో అయినా దాస‌న్న స్పందించారా? అంటే అదీ లేదు. కేవ‌లం పొలిటిక‌ల్ స్టాండ్ లో భాగంగానే ఆయ‌న మాట్లాడుతున్నార‌ని కొంద‌రు వైసీపీ నాయ‌కులే అంటున్నారే! ఎందుకిలా?

ఈ నేప‌థ్యంలో...
రాష్ట్రంలోఎన్న‌డూ లేని రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉందిప్పుడు. ఎవ్వ‌రూ త‌గ్గడం లేదు. ఎవ్వ‌రూ నోరును అదుపులో ఉంచ‌డం లేదు. దాస‌న్న లాంటి లీడ‌ర్లు కూడా అప్పుడ‌ప్పుడూ నోరు జారుతున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. దాస‌న్న స్వ‌త‌హాగా సౌమ్యుడు. వివాద ర‌హితుడు. మంచి వ్య‌క్తిత్వం. న‌డ‌వ‌డి ఉన్న‌వాడు. ఇప్ప‌టి నాయ‌కుల క‌న్నా చాలా బెట‌ర్. అయితే ఆయన కూడా ఓసంద‌ర్భంలో నోరు జారారు. తాజాగా అయ్య‌న్న వివాదంలో దాస‌న్న స్పందించారు.  దీనిపై వివాదాస్ప‌ద నేత ప్ర‌తి స్పంద‌న‌ను వీడియో రూపంలో విడుద‌ల చేశారు. ఆ వివ‌రం ఇది.

మాట్లాడుతూనే ఉంటాను అది నా హ‌క్కు ....
వివాదాస్ప‌ద నేత అయ్య‌న్న పాత్రుడు మ‌ళ్లీ స్పందించారు. త‌న ఆఖ‌రి శ్వాస వ‌ర‌కూ మాట్లాడుతూనే ఉంటాన‌న్నారు. జైల్లో పెట్టినా స‌రే తాను అందుకు సిద్ధం అని అన్నారు. అలా అంటూనే ఉన్న‌త కుటుంబం నుంచి వ‌చ్చిన దాస‌న్న త‌న‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వివాదాస్ప‌ద నేత అయ్య‌న్న పాత్రుడు అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి, ఆ ప‌ద‌విని కాపాడుకునేందుకే, జ‌గ‌న్ సూచ‌న మేరకు త‌న‌పై వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెప్పారు. అయితే త‌న‌కు ఆయ‌న‌పై గౌర‌వం ఉంద‌న్న రీతిలోనే అయ్య‌న్న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ఇవి స‌మ‌ర్థ‌నీయంగా లేవు. అయ్య‌న్న  త‌న మాటల్లో ఎక్క‌డా తిట్టుకు ఆస్కారం లేద‌నే చెప్పారు. కావాలంటే వీడియో ఫుటేజీ తెప్పించుకుని చూడాల‌ని అన్నారు. చెత్త మీద ప‌న్ను వేయ‌డం ఎంత మాత్రం సమంజ‌సం కాద‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap