త‌గాదా పాత‌దో, కొత్త‌దో కానీ రేవంత్,కేటీఆర్ యుద్ధం కార‌ణంగా కోర్టులు కూడా అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. తాజా వివాదం కార ణంగా వైట్ ఛాలెంజ్ ఒక్క‌టే కాదు లై డిటెక్ట‌ర్ ఛాలెంజ్ కూడా సిద్ధం అవ్వాల‌ని రేవంత్ కొన్ని కుంభ‌కోణాలు ఉటంకిస్తూ కేటీఆర్ కు, కేసీఆర్ కు స‌వాల్ విసిరారు.


నాపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకోను. ఒప్పుకోను. అని అంటున్నారు యువ రాజు కేటీఆర్‌. అలా అంటూనే కోర్టు మెట్లు ఎక్కే శారు. త‌రువాత టీపీసీసీ చీఫ్ పై రాజ ద్రోహం కేసు న‌మోదు ఒక్క‌టే మిగిలి ఉంది. వైట్ ఛాలెంజ్ మాటేమో కానీ తెలంగాణ‌లో కేటీ ఆర్, రేవంత్ వివాదం మాత్రం రోజురోజుకీ ర‌స‌కందాయంలో ప‌డింది. బిడ్డ‌ల‌ను ర‌క్షించాల‌న్న త‌లంపుతో ప్ర‌భుత్వం ప‌నిచేయా ల‌ని రేవంత్ చేస్తున్న విజ్ఞ‌ప్తి బాగున్నా, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న చ‌ర్య‌లేంట‌న్న‌వి కీల‌కం. కానీ తెలంగాణ స‌ర్కార్  విప‌క్షాల‌పై ఉంచిన శ్ర‌ద్ధ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉంచితే ఇప్ప‌టికే బంగారు తెలంగాణ నిర్మాణం సాకారం అయ్యేద‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి. ఒక‌వేళ రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేసేందుకే కేటీఆర్ స‌న్న‌ద్ధం అయితే అంత‌కుమించిన తెలివి త‌క్కువ ఆలోచ‌న మరొక‌టి ఉండ‌ద‌న్న మాటా వినిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే........
డ్ర‌గ్స్ కేసు మ‌రో మ‌లుపు తీసుకుంది. ఈ కేసు విష‌య‌మై రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. వైట్ ఛాలెంజ్ పేరిట కేటీఆర్ ను ఉద్దేశిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ అంత‌టా దుమారం రేపుతున్నాయి. ఇవాళ గ‌న్ పార్క్ వ‌ద్ద టీపీసీసీ నిర‌స‌న‌లు తెలుపుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ గంజాయి గ‌ల్చ‌ర్ పై పూర్తిగా దృష్టి పెట్టాల‌ని, యువ‌త‌ను మ‌త్తులో ముంచి ప్ర‌శ్నించే గొంతుల‌ను దూరం చేయ‌వ‌ద్దని హిత‌వు చెప్పారు. ముఖ్యంగా రాత్రి పూట ఓ సారి అయినా సీఎం స్థాయి వ్య‌క్తులు తిరిగితే ఫ‌లితం ఉంటుంద‌ని తెలిపారు. అదేవిధంగా సమాజాన్ని దారిలో పెట్టాల్సిన ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తులు మ‌రింత బాధ్య‌త‌తో ఉండాల‌ని, ఇవాళ తాను విసిరిన ఛాలెంజ్ కు కేటీఆర్ వ‌స్తే తానెంతో సంతోషించేవాడిన‌ని  కూడా అన్నారు. ఇక ఈ వివాదంలోనే కేటీఆర్ కోర్టును ఆశ్ర‌యించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తూ కేటీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుక‌న్నార‌ని ప్ర‌ముఖ ప‌త్రిక ద హిందూ సైతం ధ్రువీక‌రించింది. దీంతో  టీపీసీసీ చీఫ్ కోర్టు ముఖంగా ఏం చెబుతారు..చెప్పినా వాటిని కోర్టు వినిపించుకుంటుందా లేదా రేవ‌త్ రైట్ అని క్లిన్ చిట్ ఇస్తుందా? అన్న‌వి ప్ర‌శ్న‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg