తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ల కథ‌ల‌న్నీ కంచికి చేరిపోయాయి. అచ్చెన్న‌, క‌ళా లాంటి లీడ‌ర్ల‌కు ఇక గ‌డ్డు కాల‌మే. సీనియ‌ర్ పొలిటీ షియ‌న్లుగా ఉత్త‌రాంధ్ర‌ను శాసించే స్థాయి నేతలుగా వీరికి ఎంతో పేరు ఉంది. ముఖ్యంగా క‌ళా వెంక‌ట్రావు ఎన్టీఆర్ హ‌యాం నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ప‌నిచేయ‌డ‌మే కాక మంత్రిగానూ పనిచేశారు. ఆయ‌న మ‌ర‌ద‌లు మృణాళిని కూడా మంత్రిగా ప‌నిచేశారు. అంత‌కుమునుపు శ్రీ‌కాకుళం జెడ్పీ చైర్మ‌న్ గానూ ప‌నిచేశారు. ఇప్పుడు కిమిడి మృణాళిని కొడుకు కిమిడి నాగార్జున విజ‌య న‌గ‌రం పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు దేశం విభాగాన్ని న‌డిపిస్తున్నారు. ఇంత‌టి నేప‌థ్యం ఉన్న కుటుంబం అయిన‌ప్ప‌టికీ వైసీపీ ప్రాభ‌వంలో నిల‌దొక్కుకోలేక‌పోయింది. జిల్లాలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేసే నేతగా కళాకు ఉన్న పేరు కాస్త పోయింది.



అటు ఎచ్చెర్ల‌లోనూ, ఇటు రాజాంలోనూ ప‌రువు పొగొట్టుకున్నారు. ఒక్క‌టంటే ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కైవ‌సం చేసుకోలేక‌పో యారు. సొంత మండ‌లం రేగిడిలోనూ ఆయ‌న మ‌నుషులు ప‌రాజ‌యం చ‌వి చూశారు. అదేవిధంగా ఇక్క‌డ ఉన్న 20 ఎంపీటీసీల నూ వైసీపీ నెగ్గింది. ఇందులో 11 ఏక‌గ్రీవాలు కావ‌డం విశేషం. వంగ‌ర మండ‌లంలో అధికార పార్టీ స‌భ్యులు ప‌ది ఎంపీటీసీ స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకోగా, మిగ‌తా రెండూ కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. రాజాంలోనూ ఇలానే ఆయ‌న దెబ్బ‌ప‌డ్డారు. ఇక్క‌డ 76 ఎంపీటీసీ స్థానాల‌కు 59 కైవసం చేసుకుంది వైసీపీ, అదేవిధంగా ఎచ్చెర్ల‌లో 84 ఎంపీటీసీ స్థానాల‌కు 68 త‌న ఖాతాలో జ‌మ చేసుకుంది వైసీపీ. ఎలా చూసుకున్నా వైసీపీ హ‌వాలో క‌ళా బృందాలు కొట్టుకు పోయాయి. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాదు విజ‌య‌న‌గ‌రంలోనూ ఆయ‌న మ‌నుషులు ఉన్నారు.



చీపురుప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒక్క‌టంటే ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేక‌పోయారు. ఒక‌నాడు మంత్రి గా ప‌నిచేసిన రోజుల్లో తిరుగులేని రాజ‌సంతో ఉన్న నేత కాస్త ఇప్పుడు చ‌తికిల‌ప‌డ్డారు. సొంత సామాజిక‌వ‌ర్గం (కాపు) నుంచి కూడా పెద్ద‌గా ఆయ‌న‌కు మద్ద‌తు లేద‌ని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap