గృహనిర్మాణశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై సీఎం వైయస్‌.జగన్‌కు వివరాలు అందించిన అధికారులు... పలు వివరాలను జగన్ ముందు ఉంచారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం అని ఆయన పేర్కొన్నారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసారు అధికారులు. పథకం అమలుకోసం రూపొందించిన విధివిధానాలపై సమావేశంలో చర్చ జరిగింది.

ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. సెప్టెంబరు 25 నుంచి డేటాను అప్‌లోడ్‌ చేయనుంది ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌. వివిధ సచివాలయాలకు ఈడేటాను అధికారులు పంపిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఒన్‌టైం సెటిల్‌మెంట్‌పథకం ఉంటుంది.  సొమ్మను చెల్లించేలా వెసులుబాటు ఉంటుందని అధికారులు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ఉన్నాయి. ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తారు.

ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు వివరించారు. ఓటీఎస్‌ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సిఎం స్పష్టం చేసారు. అదే విధంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు. ఇప్పటివరకూ గ్రౌండ్‌ అయిన ఇళ్లు 10.31 లక్షలు అని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం... లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: