జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు నేడు. పార్టీ బలోపేతానికి జన సైనికులు అందరూ కంకణం కట్టుకుని పనిచేయాలి అని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై జనసేన పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుంది అని మనోహర్ అన్నారు. 25 కేజీలు బియ్యం కాదు..25 సంవత్సరాల భవిష్యత్ కావాలంటే జనసేన రావాలి అని ఆయన కార్యకర్తలతో అన్నారు. జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అని ఆయన విమర్శలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి కి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పాదయాత్ర చేయాలి అని కోరారు.

ప్రభుత్వం ద్వంద్వ వైఖిరి వల్ల ఇసుక కొరత ఏర్పడింది అని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ మూడు సంవత్సరాలు గడిచినా అమలు కాలేదు అని అన్నారు. రోడ్లు అద్వాన్నంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం అని మండిపడ్డారు. రోడ్ల కోసం కోట్లరూపాయలు వెచ్చించా మని ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతున్నారు అని ఆరోపించారు. ఎక్కడ చేసేరో చూపించండి అని డిమాండ్ చేసారు. రోడ్లు విషయంలో అక్టోబర్ 2 న స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి శ్రమదానం చేస్తారని ఆయన స్పష్టత ఇచ్చారు.

అధికార పార్టీ బెదిరింపులకు జనసైనికులు భయపడకుండా ముందుకు సాగాలి అని ఆయన చెప్పారు. 30 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రి అని జగన్ కలలు కంటున్నారు అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మంచి ఆలోచన తీసుకుంటారు అన్నారు. చిన్న చిన్న సమస్యలను వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అని విమర్శించారు. 150 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది  సినిమా టిక్కెట్ల అమ్మకం కోసమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పవన్ సీఎం  కావాలి..అందుకు అందరూ కష్ట పడి పని చేయాలి అని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap