ఏపీలో మహిళా ఖైదీలకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మహిళా కమీషన్ కష్టపడుతున్నాయి. ఏపీలో ఇప్పుడు మహిళా ఖైదీలను మహిళ కమిషన్ చైర్పర్సన్, వాసిరెడ్డి పద్మ తరుచుగా కలుస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల జైళ్లకు వెళ్లి వారితో ఆమె మాట్లాడుతున్నారు. వారి కుటుంబ పరిస్థితి అలాగే కుటుంబ ఆర్ధిక పరిస్థితి సహా పలు విషయాలను ఆమె తెలుసుకుంటున్నారు. సత్ప్రవర్తనతో ఉండే ఖైదీలను విడుదల చేయించడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు.

అటు మగ ఖైదీల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తన కోసం కృషి చేస్తుంది. తాజాగా విజయవాడ జైలు ని ఆమె సందర్శించారు. నేషనల్ మహిళా కమీషన్ ఇచ్చే పోషకాహారం మా కర్యక్రమం లో భాగంగా జైలును సందర్శించాం అని వివరించారు. గుంటూరు జైలును కూడస సందర్శించాం అని ఆమె పేర్కొన్నారు. మహిళ కమీషన్ అన్ని రంగాలలో ఉన్న మహిళల సమస్యలపై దృష్టి పెట్టింది అని తెలిపారు. బాలికల విద్య పట్ల నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అసంఘటిత రంగంలో మహిళలపై లైంగిక వేధింపులపై విచారణ చేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అని ఆమె తెలిపారు. అన్ని యూనివర్సిటీలలో నారీ భేరి నిర్వహిస్తున్నాం అని పద్మ అన్నారు. మహిళా సాధికారత సాధించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాం అని మీడియాతో అన్నారు. రాజకీయంగా బురద చల్లుకోవడం కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలను రాజకీయంగా వాడుకోవడం కాదు అని అన్నారు. అందరం ఉమ్మడిగా పని చేయాలి అని సూచించారు.  కన్నతండ్రులే అఘాయిత్యం చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నాం అని ఈ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చేందుకు ఆలోచిస్తున్నాం అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap