తెలంగాణాలో కరోనా కేసులు మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణాలో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. సిఎం కేసీఆర్ ఇప్పటికే మూడో వేవ్ కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారులకు పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. వ్యాక్సిన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతం అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ కి సంబంధించి వేగంగా చర్యలు చేపట్టారు.

అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ని ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది నేడు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని హైకోర్ట్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో 10శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయన్న హైకోర్టు... కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ కార్యచరణ ప్రణాళికలో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని డీహెచ్ ను హైకోర్టు ఈ సందర్భంగా నిలదీసింది. సీసీజీఆర్ఏపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న డీహెచ్ పై హైకోర్ట్ మండిపడింది. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అంటూ నిలదీసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హైకోర్టు... ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని కేంద్రంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రానికి హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts