బీజేపీ రెండోసారి దేశంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం తెస్తామని చెప్పి న విషయం తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే అధికారంలోకి రాగానే కాశ్మీర్ ను మూడు ప్రాంతాలుగా విడదీసిన విషయం తెలిసిందే. తీవ్రవాద ప్రభావితం ఉన్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయగా మిగిలినవి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. తద్వారా ఆయా ప్రాంతాలను కేంద్రం అదుపులోకి తీసుకోని తీవ్రవాదాన్ని అణిచి మళ్ళీ కాశ్మీర్ కు పునర్వైభవం  తేవాలన్నది బీజేపీ ఆలోచన. మొదటి అంఖం అయితే పూర్తి చేశారు కానీ ఇంకా కాశ్మీర్ లో చొరబాటు దారుల సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు.  

మిగిలిన ప్రాంతాలలో ఎన్నికలు కూడా జరిపింది బీజేపీ. అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబడింది. అయితే కేవలం బీజేపీ రాజకీయాల కోసమే కాశ్మీర్  ను ప్రత్యేకంగా విభజించిందా లేక మరో ప్రయోజనం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా విపక్షాలు మాత్రం బీజేపీ విభజన చేసిన తీరు స్వప్రయోజనాల కోసమే అనే విమర్శలు చేస్తూనే ఉన్నారు. అవసరం అనిపించినప్పుడల్లా బీజేపీ కాశ్మీర్ సమస్యను రాజకీయాలకు వాడుకుంటుంది తాజాగా విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే కొన్ని రాష్ట్రాలలో ఉపఎన్నికల కు నోటిఫికేషన్ ఇచ్చారు.

దానికోసమే మళ్ళీ కాశ్మీర్ సమస్యను తెరపైకి తెచ్చి రాజకీయాలకు బీజేపీ వాడుకుంటుంది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రమే హిందువులని మిగిలిన వారందరు ముస్లిం లని  ఆ పార్టీ ప్రవర్తిస్తున్నట్టు వారు విమర్శిస్తున్నారు. బీజేపీకి మొదటి నుండి మత రాజకీయాలు చేస్తుందనే పేరు ఉంది. ప్రస్తుతం కూడా ప్రచారంలో అదే కనిపిస్తుందని, విడదీసి పాలించడంలో బ్రిటిష్ తరువాత బీజేపీ వారికే మంచి ప్రావీణ్యత ఉందని వారు విమర్శిస్తున్నారు.  ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ పై పీడీపీ పార్టీ అధినేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోగాల కోసం కాశ్మీర్ సమస్యను వాడుకుంటుంది అని ఆమె ఆరోపించారు. ఒకనాటి  ప్రధానులు నెహ్రు, వాజ్ పేయి లకు కాశ్మీర్ అనేది ఒక విజన్ గా ఉంటె ఇప్పటి బీజేపీకి మాత్రం అదొక ప్రయోగశాలగా మాత్రమే ఉందని విమర్శించారు. కేవలం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు రేపడానికే దానిని వాడుకుంటున్నారని ముఫ్తి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: