పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయిన అనంతరం కొన్ని పరిణామాల వలన ఆఫ్గనిస్తాన్ ఏర్పటు చేయబడింది. ఈ నేపథ్యంలో భారత్ కలగజేసుకోవడంతో అప్పటి నుండి పాక్ కు శత్రువుగా మిగిలిపోయింది. అప్పటి నుండి ఆఫ్ఘన్ పై తిరిగి పెత్తనం తెచ్చుకోవాలని పాక్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా భారత్ అండగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఇటీవల పాక్ కు చైనా కలవడంతో వీరిరువురు కలిసి ప్రణాళికా బద్దంగా తాలిబన్ల సాయంతో ఆఫ్ఘన్ ను ఆక్రమించారు. చివరి వరకు పాక్ సాయం తాలిబాన్లకు అందుతూనే ఉన్నాడని ప్రపంచానికే తెలిసింది.

దానికి కారణం ఆఫ్ఘన్ రెండవ రక్షణ స్థలిలో ఉన్న వీరులను మట్టుపెట్టడానికి పాక్ ఆర్మీ స్వయంగా తాలిబన్లకు సాయం చేయడం అనేక మాధ్యమాల ద్వారా ప్రపంచం తెలుసుకుంది. అప్పటి నుండి అందరికి ఆఫ్ఘన్ ఆక్రమణ వెనుక పాక్, చైనాలు ప్రత్యక్షంగానే ఉన్నాయని తెలిసింది. మొత్తానికి ఆఫ్ఘన్ తాలిబన్ ల చేతిలోకి వచ్చేసింది. తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబడింది. అందులో కూడా అందరూ పాక్ కు చెందిన వారు లేదా పాక్ ఆర్మీ ద్వారా కఠిన శిక్షణ తీసుకున్న ముష్కరులు ఉండటం చూశాం.

ఇన్ని చేసిన పాక్ మదిలో ఉన్నవి రెండే, ఒకటి ఆఫ్ఘన్ పై పెత్తనం రెండు ఆ స్థానాన్ని ఉపయోగించుకొని భారత్  ను దెబ్బ కొట్టడం. మొదటిది సాధించాను అని పాక్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పాక్ సాయం చేసింది గాంధీలకు కాదు తీవ్రవాదులకు వాళ్ళు తేడా వస్తే సాయం చేసిన పాక్ పై కూడా దాడి చేసేందుకు వెనుకాడరు. అందుకే ఇప్పుడు తాలిబన్లు మరియు పాక్ ఆర్మీ మధ్య ఆఫ్ఘన్ ఆధిపత్య పోరు చాపకింద నీరులా సాగుతుంది. పాక్ చేతికి ఆఫ్ఘన్ ను ఇచ్చే రకం తాలిబన్లు కాదు కాబట్టి పాక్ కల కల్లలైనట్టే. ఇక భారత్ పై పాక్  కుట్రలు తిప్పికొట్టడానికి ఆ దేశం సిద్దంగానే ఉంది. పాక్ అనుకున్నది ఒక్కటి జరిగింది ఇంకొకటి. పెద్దలు చెప్పినట్టు ఎవడు చేసుకున్నది వాడే అనుభవించాలి అనేది పాక్ విషయంలో మరోసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: