విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ రైతు సంఘాల నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి సహకారం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని విమర్శలు చేసారు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు చంద్రబాబు. రైతుభరోసా రూ. 12,500 ఇస్తానని ‎రూ. 7500 మాత్రమే ఇఛ్చి రైతులను మోసం చేశారు అని మండిపడ్డారు.

జగన్ రెడ్డి నరేగా బిల్లులు చెల్లించకుండా పనులు చేసినవారిని ఇబ్బందులకు గురిచేశారు అని ఆయన విమర్శలు చేసారు. కోర్టు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు అని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కెళ్లింది, రాష్ట్రంలో  అభివృది లేదు, ఉపాది, పెట్టుబడులు లేవు అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి  భావితరాల భవిష్యత్ ని నాశనం చేస్తున్నారు అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ అక్రమ రవాణ జరుగుతోంది అని అన్నారు చంద్రబాబు నాయుడు.

అఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్ దిగుమతి జరుగుతోంది అని...  ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కంపెనీ పేరుతో 21 వేల కోట్ల ‍హెరాయిన్ పట్టుబడింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. డగ్స్ వ్యాపారంతో టెర్రరిస్టుల్ని, ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు. నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి  మందుబాబులను ఆరోగ్యపరంగా, ఆర్దికంగా పీల్చి పిప్పి చేస్తున్నారు అన్నారు ఆయన. కరెంట్ చార్జీలు, నిత్యవసర ధరలు, పెట్రోల్ , డీజిల్ అన్ని రేట్లు పెంచి సామాన్యుడు రాష్ర్టంలో  జీవించలేని పరిస్థితి తెచ్చారు అని ఆరోపించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని, రైతుల్ని అన్ని విధాల ప్రోత్సహించాం, ‎5 ఏళ్ల లో సాగునీటి రంగంపైనే రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం అని గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: