ఎప్పుడు వివాదాలలో ముందుండే ఎంఐఎం పార్టీ మరో వివాదానికి తెరలేపింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేయబడిన ఉపఎన్నికలలో తాను పాల్గొంటూ ఒక పోస్టర్ విడుదల చేసింది. దానిపై అభ్యన్తరకర విధంగా రాతలు రాసింది. ఉత్తరప్రదేశ్ లో ప్రచారానికి ఈ పోస్టర్ విడుదల చేసింది. దానిమీద ఘాజీల భూమిపై గర్జిద్దాం అంటూ రాసింది. దానిని సిద్ధం చేయించుకున్న వారికి దానిపై ఎటువంటి అభ్యన్తరాలు లేనప్పటికీ బీజేపీ తన అభ్యన్తరాలను వ్యక్తపరిచింది. ఇలాంటి వివాదాస్పద పోస్టర్లు ప్రచారం కోసం వాడటం సరికాదని సూచించింది.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో ఎంఐఎం చేపట్టిన ర్యాలీలో ఈ రగడ చోటుచేసుకుంది. గతంలో కూడా అయోధ్యలో ర్యాలీ చేయునప్పుడు కూడా ఎంఐఎం ఇలాంటి వివాదాస్పద పోస్టర్ తోనే పబ్లిసిటీ చేసుకుంది. అప్పుడు కూడా ఆ పోస్టర్ పై తీవ్ర అభ్యన్తరాలు వెలువడ్డాయి. ఇలాంటి పోస్టర్ల ద్వారా ఎంఐఎం తమ వర్గాలను రెచ్చగొట్టి ఓట్ల రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ విమర్శిస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఎంఐఎం అధినేత ఇంటిపై హిందూ మతస్తుల పేరుతో కొందరు దాడిచేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లో వచ్చే నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పార్టీకి ప్రాణం పోయాలని ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ వివాదాస్పద పోస్టర్ తో ర్యాలీకి వెళ్ళింది ఆ పార్టీ. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో కనీసం వంద మంది ఎంఐఎం నేతలను బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పార్టీ దేశంలో ఎక్కడ ముస్లిముల ప్రాధాన్యత ఉన్నదో అక్కడ పోటీ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో తన పార్టీ సభ్యులతో ప్రచారం చేస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎంఐఎం అనుకున్న ఫలితాలు రాలేదు. ఇక్కడ కూడా అదే విధంగా జరగనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంఐఎం కు ఈ ప్రచారానికి కావాల్సిన నిధులు సహా ఇతర సరంజామా ఎక్కడ నుండి ఎవరు సమకూరుస్తున్నారు అనేది తేల్చాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: