సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండున్నర ఏళ్లు సమయం ఉంది. రాష్ట్రంలో కూడా ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కూడా. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు... ఇదే మాట. అదే సమయంలో మంత్రివర్గ కూర్పు పై కూడా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారు కూడా... ఇదే టాపిక్‌పై చర్చించుకుంటున్నారు. ఇక మరో టాపిక్ ఏమిటంటే... రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులపై కూడా... ఇటు అధికార పార్టీ వైసీపీలో, అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కీలక నియోజకవర్గాలు, కీలక వ్యక్తులపై పోటీ చేసే నేతలు ఎవరూ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఓ వారం క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో 80 శాతం మందిని మారుస్తానన్నారు. అయితే మారిన వారంతా కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇప్పుడు ఆ మిగిలి ఉండే 20 శాతం ఎవరనేది కీలక ప్రశ్న. రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై జగన్ ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టడంతో.... టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ మార్కు రాజకీయానికి తెరలేపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై కానీ, టీడీపీ నేతలపై కానీ ఒంటికాలితో దూకే వ్యక్తి ఎవరూ అంటే అంతా కొడాలి నానిపై చూపిస్తారు. ఒకప్పుడు టీడీపి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలి నాని పూర్తిగా సొంతం చేసుకున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ సవాల్ కూడా చేశాడు కొడాలి నాని. ఈ విషయాన్ని చంద్రబాబు సీరీయస్‌గా తీసుకున్నట్లున్నారు. అందుకే ఇప్పటి నుంచే గుడివాడ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో లాస్ట్ మినిట్‌లో టీడీపీ తరఫున పోటీ చేసిన దేవినేని అవినాష్.... ఫలితాల అనంతరం వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో ప్రస్తుతం అక్కడ సరైన నేత లేకుండా పోయాడు. అన్ని విషయాలు లోతుగా ఆలోచించిన చంద్రబాబు... ఈ సారి గుడివాడ నుంచి కొడాలి నాని అత్యంత ఆప్తుడు, కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వంగవీటి రాధాను బరిలోకి దింపారు. ఇప్పుడు అక్కడ అంతా ఒకటే టాపిక్... ఇద్దరు మిత్రుల్లో ఎవరు విజయం సాధిస్తారో అని. సో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: