ఇటీవల వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాల్లో టి‌డి‌పి చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గం...ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా వైసీపీ గాలిలో టి‌డి‌పి కొట్టుకుపోయింది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా సైకిల్‌కు పంక్చర్లు పడ్డాయి. అయితే ఇంత దారుణమైన ఓటములో కూడా టి‌డి‌పికి కాస్త ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందటే...అది నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో టి‌డి‌పి పై చేయి సాధించడం.

నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో మాత్రమే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు జరిగాయి. జెడ్‌పి‌టి‌సిని వైసీపీనే గెలుచుకుంది. కానీ 18 ఎం‌పి‌టి‌సిల్లో టి‌డి‌పి 9 గెలుచుకోగా, వైసీపీ 8 గెలుచుకుంది. జనసేన ఒకటి గెలుచుకుంది. ఇక జనసేన టి‌డి‌పికి సపోర్ట్ ఇవ్వనుంది. అంటే ఎంపీపీ స్థానం టి‌డి‌పినే కైవసం చేసుకుంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ చోటు చేసుకుంది. మామూలుగానే వైసీపీ 7 ఎం‌పి‌టిసిలని గెలుచుకుంది. కానీ ఒక ఎం‌పి‌టిసి స్థానంలో జనసేన గెలిస్తే...రీకౌంటింగ్ చేయించారు.

అయినా జనసేన గెలిచింది. కానీ అధికారికంగా ప్రకటించేసరికి వైసీపీ గెలిచిందని అధికారులు ప్రకటించారు. దీంతో అది కూడా వైసీపీ గెలుచుకుంది.  ఇదొక ట్విస్ట్ అనుకుంటే...మెజారిటీ లేకపోయిన ఎంపీపీ కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పికి ఎంపీపీ పీఠం దక్కకుండా చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఏ ఎం‌పి‌టి‌సి కూడా లొంగడం లేదు.

ఈ క్రమంలోనే దుగ్గిరాల తహశీల్దార్ టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని తెలిసింది. అంటే ఆ పత్రం ఇవ్వకుండా అడ్డుంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనబడుతోంది. అయితే ఇలా చేసి టి‌డి‌పికి చెక్ పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. అంటే అధికారంతో వైసీపీ ఎన్ని రకాలుగా గెలవాలని అనుకుంటుందో...ఇదొక ఉదాహరణ అని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇక ఎన్నికల్లో ఎన్ని రకాల కుట్రలు చేశారో కూడా అందరికీ తెలుసని మాట్లాడుతున్నారు. ఏదేమైనా అధికారం తమకే దక్కాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: