మావోల వారోత్స‌వాలు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు సంబంధిత ప్ర‌భావిత ప్రాంతాల్లో కూడా జ‌రుగుతున్నాయి. చాలా రోజుల త‌రువాత క‌రోనా ప్ర‌భావం కాస్త తగ్గిన త‌ రువాత న‌క్సల్ ప్ర‌భావం ఏమీ లేదు అనుకుంటున్న త‌రుణాన ఈ వారోత్స‌వాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. దీంతో విశాఖ మ‌న్యంతో పాటు మిగ‌తా స‌రిహ‌ద్దు ప్రాం తాల‌లో కూడా తూటాల పేలుళ్ల‌ను వినిపించేందుకు ఇరు వ‌ర్గాలూ ప‌ట్టు మీదున్నాయి. ఈ సారి ఎవ‌రి ప‌ట్టు ఎంత‌న్న‌ది తేలిపోనుంది. అన్న పంతంతో పోలీసులు కూబింగ్ ను ముమ్మ‌రం చేశారు. ఉన్న‌తాధికారులు సైతం ప్ర‌తికారం పైనే దృష్టి సారిస్తున్నారు. అదేవిధంగా లొంగు బాటు చ‌ర్య‌ల‌నూ ప్రోత్స‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల కొత్త రిక్రూట్మెంట్లు ఏవీ లేవ‌ని మావోల సంబంధీకులు చెబుతున్నారని తెలుస్తోంది. మ‌రి! వారోత్స‌వాల నేప‌థ్యంలో కీల‌క ద‌ళాలు గ్రామాల్లోకి పోయి కొత్త వారిని ఎవ్వ‌రినైనా ఇటు గా తీసుకువ‌స్తున్నారా లేదా ? అన్న‌ది కూడా పోలీసుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మ‌రోవైపు అస‌లు ర‌హ‌దారుల‌కు ఏపీలో దిక్కు లేక‌పోయినా జ‌గ‌న్ మా వో ప్ర‌భావిత ప్రాంతాల‌కు ర‌హ‌దారులు మాత్రం వేయిస్తున్నాడు. ఎందుక‌ని? నాన్న మాదిరి చ‌ర్చ‌ల‌కు వాళ్ల‌తో వెళ్ల‌నున్నాడా?




జ‌గ‌న్ హ‌యాంలో అంతా ప్ర‌శాంతంగా ఉంది. ప‌క్క‌న బీజూ జ‌న‌తాద‌ళ్ పార్టీ హయాంలో కూడా చాలా ప్ర‌శాంతంగా ఉంది. ఇంత ప్ర‌శాం తత నేప‌థ్యంలో మావోల అల‌జ‌డి మ‌ళ్లీ మొద‌ల‌యి వార్త‌ల్లో నిలిచింది. పోలీసులు, మావోల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగినంత ప ని అయింది కూడా! కానీ తృటిలో న‌క్స‌ల్ త‌ప్పుకున్నారు. దీంతో పోలీసులు కూబింగ్ యాక్టివిటీస్ ను మ‌రింత కట్టుదిట్టం చేశారు. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ ప‌రిస్థితులు ఉన్నాయి.



మావోల వారోత్స‌వాల నేప‌థ్యంలో ఆంధ్రా ఒడిశా బోర్డర్ ఎలా ఉంది. స‌రిహ‌ద్దు కదా ప్ర‌శాంత‌త‌ల‌కు దూరంగా ఉంది. లేదా ప్ర‌శాంత త‌ల‌ను వెతుక్కునే ప‌నిలో ఉంది. ఏదేమై న‌ప్ప‌టికీ చాలా కాలం త‌రువాత పోలీసులు విధుల్లో ఉంటుండ‌గా న‌క్స‌ల్ యోధులు కొంద‌రు ఎదురుపడ్డారు. దీంతో ఎదురు కాల్పులకు సిద్ధం అవుతుండ‌గా, కాల్పులు జ‌ రుపుతూ పారిపోయారు న‌క్సల్స్. దీంతో ఏఓబీలో ఉద్రిక్త ప‌రిణామాలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: