ఇటీవలే వర్షాకాలం ప్రారంభం లోనే వానలు దంచి కొట్టాయ్ అన్న విషయం తెలిసిందే.  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అటు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడంతో అష్టకష్టాలు పడ్డారు. అయితే అటు రైతులు  చాలా రోజుల తర్వాత వర్షపు చినుకు పడటంతో  మట్టి వాసన కు పులకించి పోయారు.  ఇలా తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా ఇటీవలే వర్షాకాలం ప్రారంభం లోనే భారీగా వర్షాలు కురిసాయ్.  ఇక ఈ భారీ వర్షాల కారణంగా రైతులు సంతోష పడినప్పటికీ నగరాల్లో జనాలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్పాలి.



 ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గ్రామాల్లో చెరువులు కుంటలు అన్ని నిండి  రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. అదే సమయంలో నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఈ క్రమంలోనే రోడ్లన్నీ పెద్ద పెద్ద చెరువులను తలపించాయి.  దీంతో ఎంతో మంది నగర ప్రజలు అష్టకష్టాలు పడాల్సినా పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు ప్రభుత్వం కూడా ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయ చర్యలు కూడా చేపట్టింది.



 అయితే ఇటీవలే ఈ వర్షాకాలంలో కురిసిన వర్షాలు అన్ని రాష్ట్రాలకంటే అటు తెలంగాణలోనే ఎక్కువ కురిసాయి అన్న విషయం ఇటీవలే వెల్లడయ్యింది. దేశంలో అత్యధిక సగటు వర్షపాతంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా ఇదే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎక్కువ కావడం గమనార్హం. ఇక తెలంగాణ తర్వాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీలో 29 శాతం.. హర్యానాలో 21 శాతం.. తమిళనాడులో 20 శాతం.. వర్షపాతం నమోదయింది. అయితే దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాలు కేవలం ఎనిమిది మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా టాప్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: