కొన్ని దేశాల సాయంతో తాలిబన్లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖంగా భారత్ పై అక్కసు తీర్చుకోడానికే అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ ఘటన వెనుక పాక్, చైనా మరి కొన్ని దేశాలు ఉన్నట్టు బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఆఫ్ఘన్ వీరులను అంతమొందించడం లో పాక్ ఆర్మీ జోక్యం నుండి తాలిబన్ రాజ్యాన్ని స్వాగతించడం వరకు ప్రపంచం ఇదంతా చూస్తూనే ఉంది. అయితే భారత్ అంతర్గత విషయం కనుక ఇతర దేశాలు ఈ విషయంలో కల్పించుకోలేదు అనేది తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా ముష్కరులకు ఒక దేశం ఉండటాన్ని మాత్రం ప్రపంచం ఈ ఘటన జరిగిన తరువాత ఖండిస్తూ వస్తుంది.

తాలిబన్ లు ఆఫ్ఘన్ అక్రమణ అనంతరం తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ లో ఉన్న రాక్షస ప్రముఖులను చుసిన ప్రపంచానికి కాస్త మెలుకువ వచ్చింది. అంటే ఇంతటి రాక్షసులు నేతలుగా ఉంటె రాబోయే రోజులలో ప్రపంచాన్ని తీవ్రవాదంతో అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని అన్ని దేశాలకు తెలిసివచ్చింది. అందువలననే ఆయా దేశాలు మెల్లిగా తాలిబన్ ల నుండి తప్పుకుంటూ  వాళ్ళ దేశాన్ని గుర్తించడంలో నాన్చుడు యవ్వారం చేస్తున్నాయి. ఈ కూర్పు చుసిన తరువాతే ఆయా దేశాలకు తాలిబన్ ల ఆక్రమణ స్వాగతిస్తే వచ్చే ప్రమాదం తెలిసి వచ్చింది.

ఇక తాజాగా అక్కడ పరిణామాలు గమనిస్తే ఇప్పటివరకు సాయం చేసిన పాక్ ఆఫ్ఘన్ పై పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ అది ఉన్నది ముష్కరుల చేతిలో కావటంతో పాక్ అసలు అంత సులభంగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇక మరోవైపు పాక్ లో తీవ్రదవం పెంచి పోషించబడుతున్నదని ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. అంటే ఐఎస్ లాంటి సంస్థలకు పాక్ స్థావరంగా మారిందనేది ప్రపంచం తెలుసుకుంది. ఇప్పటి వరకు ఆ ఐఎస్ తాలిబన్ లను అమెరికా సైన్యం నుండి రక్షిస్తూ వచ్చింది. వారందరికీ తర్ఫీదు లాంవిటి చూసుకుంది. దీనితో ఆఫ్ఘన్ పై  పెత్తనానికి ఐఎస్ కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రపంచ తీవ్రవాద దళాలు చేరి సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనితో ఆయా వర్గాల మధ్య ఆఫ్ఘన్ పై ఆధిపత్య పోరు గట్టిగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: