కరోనా అనంతరం ప్రధాని పర్యటనలు కూడా రద్దు చేయబడ్డాయి. ఏ విదేశీ సమావేశం అయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతుంది. ఇటీవల అనేక దేశాలతో ప్రధాని ఈవిధంగానే సమావేశాలలో పాల్గొన్నారు. తాజా ఆఫ్ఘన్ అక్రమం, విదేశీ ప్రయాణాలు తదితర అంశాల ను ఆయా దేశాల అధినేతలతో, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా భారత్ ఎప్పుడూ ప్రపంచాన్ని వసుదైక కుటుంబం మాదిరిగానే చూస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.  అందుకే ఎక్కడ ఏ ఆపద వచ్చినా తాము ముందు స్పందిస్తున్నామని ఆయన అన్నారు. కరోనా సమయంలోను స్వదేశం సహా ఎన్నో దేశాలకు వాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు.

ఇక కరోనా రెండో వేవ్ లో కాస్త తడబడటం జరిగిందని, అయినా పరిస్థితిని అదుపులోకి తెచుకున్నామని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో వివిధ దేశాలు విదేశీ ప్రయాణాలను తాత్కాలికంగా నిషేదించిన విషయం గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితిని బట్టి కరోనా కేసులు అదుపులో ఉండటంతో, మళ్ళీ విదేశీ ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ఆయా దేశాలు రెండు డోసుల వాక్సినేషన్ చేయించుకున్న వారినే తమ దేశాలలోకి అనుమతిస్తామని స్పష్టంగా మార్గనిర్దేశాలు జారీ చేశాయి. తదనుగుణంగానే భారతీయులు రెండు డోసులు వాక్సినేషన్ పూర్తి చేసుకొని విదేశీ యానాలకు సిద్ధం అవుతున్నారు.

అయితే బ్రిటన్ లాంటి దేశాలు ఈ సందర్భంలో ఏవేవో సాకులు చెప్తూ విదేశీ ప్రయాణికులను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో స్వయంగా ప్రధాని కల్పించుకొని ఆ దేశానికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. దీనితో బ్రిటన్ భారతీయులను తమ దేశానికి స్వాగతించడం ప్రారంభించింది. కరోనా వాక్సినేషన్ చేయించుకున్నట్టు ఇస్తున్న ధ్రువపత్రాలను ఆయా దేశాలు స్వాగతించాలి ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తద్వారా విదేశీ ప్రయాణాలు సరళతరం కాగలవని ఆయన తెలిపారు. భారత్ లో అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటికే 80 కోట్ల డోసులను వినియోగించినట్టు మోడీ సమావేశంలో తెలిపారు. కరోనా సమయంలో ఎన్నో దేశాలకు వాక్సిన్ సహా అనేక ఔషధాలను, ఇతర సామాగ్రిని సరఫరా చేసినట్టు తెలిపారు. ఇలాంటివి ఆయా దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను తెలియజేస్తామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: