ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో అవకతవకలకు సంబంధించి ఏసీబీ అధికారులు సీరియస్ గా ఫోకస్ చేసారు. ప్రొద్దుటూరు కు చెందిన లక్మయ్య యాదవ్ 2016 వ సంవత్సరంలో తప్పుడు మెడికల్ బిల్లులు వివిధ వ్యక్తుల పేర్లతో సమర్పించారు అని విచారణలో గుర్తించారు. సిఏంఆర్ఎఫ్ నుండి నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అని అధికారులు పేర్కొన్నారు. 2017 వ సంవత్సరంలో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. 2014 సంవత్సరం నుండి సిఏంఆర్ఎఫ్ నుండి ప్రాసెస్ అయిన ఫైల్స్ ను పూర్తిగా పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారు.

సిఏంఆర్ఎఫ్ కొన్ని అవకతవకలు ను గుర్తించారు. మెడికల్ ప్యాకేజీ నందు పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో  మంజూరు  చేశారు అని విచారణలో వెల్లడి అయింది. ఒకే రకమైన ఫోన్ నెంబర్లుతో  చాలా అప్లికేషన్స్ వచ్చాయి అని ఒకే రకమైన వ్యాధి ని ఎక్కువ దరఖాస్తులలో రాయడం ఒకటి... అలాగే చికిత్స పొందిన ఆసుపత్రి అడ్మిషన్ నెంబర్లు లేకపోవడం వంటివి కూడా బయటపడ్డాయి. అనుమానాస్పదంగా ఉన్న 88 మెడికల్ క్లెయిమ్స్ ను అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు.

ఈ 88 మెడికల్ క్లెయిమ్స్ కి 1,81,78,000/- లు మంజూరు అయినట్టు తెలిసింది.  వీటిలో  కేవలం 35 మెడికల్ క్లెయిమ్స్ కు రు . 61,68,000 / జమ చేసారు. సిఏంఆర్ఎఫ్ అధికారుల జోక్యంతో మిగిలిన 55 మెడికల్ క్లెయిమ్స్ కు రు . 1,20,00,000 /- జమచేయకుండా ఆపారు అని వెల్లడి అయింది. ఈ అక్రమాల పై పూర్తి స్థాయి లో విచారణ చేపట్టిన  ఏసీబీ  అధికారులు... త్వరలోనే కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సెటేరియట్ రెవిన్యూ డిపార్టుమెంటు లో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్ సోకా రమేష్ అలాగే సుబ్రహ్మణ్యం అనే ఒక అధికారి, వీరితోపాటు సుబ్రహ్మణ్యం అనుచరుడు చదలవాడ మురళీ కృష్ణ అనే వ్యక్తి ఉన్నట్టుగా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap