సరిహద్దు వివాదానికి తెరపడేది ఎన్నడు ?
సరిహద్దు రాష్ట్రలతో ఆంధ్ర ప్రదేశ్ కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ పక్కనున్న తెలంగాణలో జల వివాదం సద్దు మణక ముందే మరో వివాదం చాపక్రింద నీరులా  పెరిగి పెద్దయింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్లిందంటే...  తమ భూభాగంలోకి వస్తే సహించేది లేదని అక్కడి గ్రామస్తులు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యుడినే   బెదిరించారు.
ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల మధ్యనున్న  గ్రామం కొఠియా.  ఈ పంచాయితీ ఒడిశా రాష్ట్రం  కోరాపుట్ జిల్లా  సరిహద్దులో ఉంది. ఈ  పంచాయితీ పరిధిలోని 20 పల్లెలు ఆంధ్ర ప్రదేశ్ లోని గజపతి నగరం పరిధిలోకి వస్తాయి. నానాటికీ పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పల్లెల విస్తీర్ణం పెరిగింది.   ఈ పెరుగుదల  గ్రామాల్లో అంతరాలను పెంచింది. సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోసింది. ఈ  ప్రాంతంలో ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు రెండూ కూడా  తమ సరిహద్దులు  పక్కన పెట్టి అభివృద్ధి పనులు చేశాయి.
 ఆదివాసీ ప్రాంతం కావడంలో మౌలిక సదుపాయాల కల్పనుక ఇరు ప్రభుత్వాలు పెద్ద పీఠ వేశాయి.  అదే సమయంలో వామపక్ష భావజాలం గల  పార్టీలు ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నాయి. కొఠియా ప్రాంతంలో ఘర్షణలు కొద్ది నెలలుగా జరుగుతున్నాయి. అవి క్రమంగా గజపతి నగరం జిల్లాకుకూడా పాకాయి. దీంతో చిన్న చిన్న వివాదాలు రెండు రాష్ట్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆగస్టు తొలి వారంలో ఆంధ్ర ప్రదేశ్ లోని సాలూరు ఎం.ఎల్.ఏ  రాజన్నదొర కొఠియా సమీపంలోని ఓ పల్లెలో  అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసే నిమిత్తం  ఆ ప్రాంతానికి వెళ్లారు. దీనిని అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. మా భూభాగంలోకి రావడానికి వీలు లేదని వారు బైఠాయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడకి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పారు.

గ్రామాల మధ్య వివాదాలు తరచుగా జరుగుతుండడం, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుండంతో ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద తలనొప్పి గా మారింది.  దీంతో సరిహద్దు సమస్యను పరిష్కరించాలంటూ కేంద్ర విద్యాాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  కి లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యను పరిష్కరించాలని  ఆ లేఖలో కోరారు.  వ్యక్తి గతంగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య  స్నేహ సంబంధాలను కేంద్ర మంత్రి తన లేఖలో ప్రాస్తావించారు. ఇటీవల కొఠియాలో జరిగిన పంచాయితి ఎన్నికల సమయంలో సరిహద్దు వద్ద ఒడిశా పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గోన్నారని  కేంద్ర మంత్రి గుర్తు చేశారు. సమస్య తీవ్రరూపం దాల్చకముందే పరిష్కారం చూడాలని కేంద్ర  మంత్రి  ధర్మెంధ్ర ప్రధాన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: