చిత్తూర్ జిల్లాలో టీడీపీ కనుమరుగైపోతుంది. తాజా ప్రాంతీయ ఎన్నికల లెక్కింపు లో కూడా ఇక్కడ టీడీపీ కనీస సీట్లు కూడా దక్కించుకోలేక పోయింది. ఆ పార్టీ సొంత నియోజక వర్గం కుప్పం లో కూడా టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. ఇది కేవలం ఆ పార్టీ నిర్లక్ష్య ధోరణి వలననే జరిగిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ పార్టీ ఒక వెలుగు వెలిగిన ప్రాంతంలో మరో పార్టీ జండా రెపరెపలాడుతోంది. ఇన్ని జరుగుతున్నా అక్కడ టీడీపీ రాజకీయాలలో మాత్రం మార్పు ఉండటంలేదు. ఎంతసేపు కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప నియోజక వర్గానికి ఒరగబెట్టింది ఏమి లేదని అక్కడి ప్రజలు వేరే పార్టీ జండాను భుజాన వేసుకున్నట్టే ఉంది.

ఈ స్థానం ఈసారి కూడా ప్రస్తుత రాష్ట్ర అధికార పార్టీ చేతికే వెళ్తుందన్నది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూస్తేనే అర్ధం అవుతుంది. అయినప్పటికీ కొంతలోకొంతైనా తమ ప్రభావం చూపించి కాస్త ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే స్థాయికి టీడీపీ దిగజారి పోయింది. కేవలం పనికిమాలిన రాజకీయాలు తప్ప ప్రాంత అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని పలువురు నియోజక వర్గ వాసులు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టే చెప్పేస్తుండటం విశేషం. అసలు టీడీపీ ఆవిర్భావం అనంతరం ఎన్టీఆర్ చేసిన పరిపాలనా విధానం ఎలా ఉంది, ఆయన తరువాత పాలన ఎలా ఉంది అనేది అందరు గమనిస్తే ఎవరు తమ ప్రాంతాన్ని పట్టించుకొన్నారో స్పష్టంగా అందరికి అర్ధం అవుతుంది.

ఒకప్పటి మాదిరే మళ్ళీ చిత్తూర్ టీడీపీ గడ్డ కావాలి అంటే ఆ పార్టీ తన తీరును మార్చేసుకోవాల్సి ఉంటుంది. కుక్క తోక వంకర అనేది ఎలా మార్చడం వీలుకాదో ఆ పార్టీ ప్రస్తుత స్థితిని కూడా మార్చడం కుదరని పని అని నిపుణులు అంటున్నారు. అందుకే విరక్తి చెందిన ప్రజలు వేరే జండాను భుజాలకు ఎత్తుకున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇక వైసీపీ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడి ప్రజలకు అన్ని పధకాలు ఇంటికే చేర్చి వారి మనసులలో చెరగని ముద్ర వేసింది. దీనితో అక్కడ తరువాతి ఎన్నికలలో కూడా వైసీపీ విజయ ఘంటారావం మోగకుండా అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: