కేర‌ళ రాష్ట్రంలోని బీజేపీ పార్టీలో ముస‌లం వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కేర‌ళ లో కాషాయ జెండా పాతాల‌ని కొన్ని సంవ‌త్స‌రాల నుంచి బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే కేర‌ళ‌లో అధికారంలో ఉన్న సీపీఎం ఆధ్వ‌ర్యంలో ని ఎల్ డీ ఎఫ్ మాత్రం బీజేపీ ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. చివ‌ర సారీ కేర‌ళ లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ప్ప కుండా క‌నీసం 10 నుంచి 20 నియోజ‌క వ‌ర్గాల లో విజ‌యం సాధిస్తామ‌ని బీజేపీ నాయ‌కులు ధీమ వ్య‌క్తం చేశారు. అలాగే మిగిలిన స్థానాల‌లో సీపీఎం కు గ‌ట్టి పోటీ ఇస్తామ‌ని క‌ల‌లు క‌న్నారు. దీని కోసం కేంద్ర మంత్రి వ‌ర్గం మొత్తం కేర‌ళ‌లో తిష్ట వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా చాలా సార్లు కేర‌ళ ఎన్నిక ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.




అయినా కేర‌ళ ప్ర‌జ‌లు బీజేపీ వైపు ఏ మాత్రం చూడ లేదు. చాలా చోట్ల క‌నీసం డిపాజిట్లు కూడా రాలేదు. అంతే కాకుండా బీజీపీ వాళ్లు అన్న 10 సీట్లు కాదు క‌ద‌.. గ‌తం ఉన్న ఒక సీటు కూడా కొల్పొయింది. అలాగే కేర‌ళ‌లో బీజేపీ సీఎం అభ్య‌ర్తీ మెట్రో మ్యాన్ శ్రీధ‌ర‌న్ కూడా అనుహ్యంగా ఓటమి పాల‌య్యాడు. ఈ ప‌రిణామాల‌పై బీజేపీ అధిష్టానం సిరీయ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. ఈ ఓట‌మి కార‌ణం కేర‌ళ బీజేపీ రాష్ట్ర నాయ‌కులు మ‌ధ్య స‌యోధ్య లేక పోవ‌డమే అని అధిష్టానం భావించ‌న‌ట్టు తెలుస్తుంది. దీని చక్క దీద్ద డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే రాష్ట్ర నాయ‌కులు ఎదో ఒక కేసుల లో ఉండి పోలీసులు ప్ర‌శ్నిస్తూ ఉన్నార‌ట‌. అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో హైవే పై దొరికిన డ‌బ్బులు బీజేపీ యే అని పోలీసులు అంటున్నార‌ని.. వీటి అన్నింటినీ ఎదుర్కొవ‌డంలో రాష్ట్ర నాయ‌క‌త్వం విఫ‌లం అయింద‌ని అధిష్టానం అభిప్రాయ ప‌డిన‌ట్టు తెలుస్తోంది.




దీంతో రాష్ట్ర క‌మిటీ ని చ‌క్క దీద్ద ల‌నే ఉద్ద‌శంతో బీజేపీ అధిష్టానం ఉంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న సురేంద‌ర్ ను త‌ప్పించాల‌ని చూస్తోంద‌ని తెలుస్తోంది. సురేంద‌ర్ పై ఇప్ప‌టికే చాలా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల నిధిని దుర్వినియోగం చేసాడ‌నే అభియోగం కూడా ఉండ‌టం తో త‌ప్పించ‌డం ఖాయం గా తెలుస్తుంది. సురేంద‌ర్ స్థానంలో సురేష్ గోపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అవుతాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విష‌యం పై సురేష్ తో బీజేపీ అధిష్టానం మాట్లాడిన‌ట్టు తెలుస్తుంది. ఈ కొత్త అధ్య‌క్షుడు కేర‌ళ బీజేపీ భ‌విష్య‌త్తు ను మారుస్తాడా అనేది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: