తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కి అప్పుల బాధ విఫ‌రీతంగా ఉందంటా. గ‌తంలో టీఎస్ ఆర్టీసీ ని ప్ర‌యివేటు చేస్తామ‌ని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో ఆర్టీసీ కార్మికులు అంద‌రూ స‌మ్మె చేశారు. దాదాపు రెండు నెల‌లు ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేశారు. ఆ స‌మ్మె స‌మ‌యంలో ఆర్టీసీ దాదాపు రోజుకు ప‌ది కోట్ల మేర న‌ష్ట పోయింది. దీని త‌ర్వాత ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరారు. స‌మ్మె కాలం లో వ‌చ్చిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డానికి ఆర్టీసీ ఛార్జీ ల‌ను పెంచేసింది. గ‌తంలో ఉన్న వాటిపై 20 శాతం మేర పెంచింది. ఛార్జీ ల‌ను పెంచ‌డం ద్వారా ఆర్టీసీ ని లాభాల బాట న‌డిపించ‌వ‌చ్చ ని ప్ర‌భుత్వం భావించింది.



అయితే అప్పుడ‌ప్పుడే న‌ష్టా ల నుంచి తెరుకుంటున్న స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ విధించారు. దీంతో ఆర్టీసీ కథ మ‌ళ్లి మొద‌టికి వచ్చింది. దాదాపు ఏడాది పాటు రోడ్ల పై ప్ర‌గ‌తి చ‌క్రం తిర‌గ లేదు. దీంతో న‌ష్టాలు విప‌రీతంగా పెరిగిపోయాయి.  ఈ మ‌ధ్య  ఏడాదిన్న‌ర కాలంలోనే తెలంగాణ ఆర్టీసీ కి  2 వేల 780 కోట్ల న‌ష్టం వాటిల్లింది. అంతే కాకుండా ఈ ఏడాది జూన్ చివ‌రి నాటికే  ఆర్టీసీ కి 6 వేల 115 కోట్ల అప్పు ఉంద‌ని ఆర్టీసీ ఉన్న‌త అధికారులే తెల్చి చెప్పారు. ప్ర‌స్తుతం కూడా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఉన్నందున బ‌స్సులు పూర్తి గా తిర‌గ‌డం లేదు. అంటే ఇప్పుడు కూడా తెలంగాణ ఆర్టీసీ కి న‌ష్టాలు వ‌స్తున్నాయి.




తెలంగాణ ఆర్టీసీ ని న‌స్టాల నుంచి గ‌ట్టేక్కిం చడానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్రంగానే శ్ర‌మీస్తుంది. ఇప్ప‌టికే ఆర్టీసీ ఎండీ గా హైదారాబాద్ క‌మిష‌న‌ర్ గా చేసిన స‌జ్జ‌నార్ ను నియ‌మించింది. అలాగే ఆర్టీసీ చైర్మెన్ గా నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ను నియ‌మించింది. స‌జ్జ‌నార్ ఏ స్థానంలో చాలా నిజాయితీ తో ప‌ని చేస్తాడు. అందు వ‌ల్ల ఆర్టీసీ ని గ‌ట్టేక్కించే సామ‌ర్థ్యం కేవ‌లం స‌జ్జనార్ కే ఉన్నాయ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావించింది. అలాగే ఆర్టీసీ విప‌రీత‌మైన అప్పుల నుంచి కొలుకోవ‌డానికి గ‌త బ‌డ్జేట్ లోనే రూ. 1500  కోట్లు కేటాయించింది. అలాగే మ‌రో రూ. 1500 కోట్లు బ్యాంక్ ల నుంచి రుణం వ‌చ్చేలా చూసింది. అయితే వ‌చ్చే మూడు నుంచి నాలుగు నెల‌లో ఆర్టీసీ ని న‌ష్టాల నుంచి గ‌ట్టేక్కించాల‌ని ప్ర‌స్తుతం ఉన్న ఎండీ, చైర్మెన్ ల‌కు గ‌డువు ను ఇచ్చింది. ఈ గ‌డువు లోగా లాభాల బాట ప‌ట్ట‌కుంటే ప్ర‌భుత్వం ఆర్టీసీ ని ప్ర‌యివేటు చేస్తుందా అనే అనుమానాలు ప్ర‌జ‌ల్లో వ్య‌క్త మ‌వుతున్నాయి. ఈ నాలుగు నెల‌లో ఎం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.




మరింత సమాచారం తెలుసుకోండి: