ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసినప్పటికీ పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం మాత్రం 50 వరకు కూడా రావటం లేదు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఎంత ఆర్బాటంగా అనేక మంది ప్రముఖులతో ఓటింగ్ ప్రాముఖ్యతను గురించి ప్రచారం చేయిస్తున్నా ఈ ప్రాంతాలలో శాతాన్ని మాత్రం కొంచం కూడా మార్చలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రాముఖ్యత తెలియనిదేమి కాదు. అయినప్పటికీ అసలు పార్టీలే బోలెడు ఉంటాయి, అందులో ఓట్లు వేసే ప్రజలు కూడా 50 శాతమే ఓటింగ్ చేస్తే ఆ శాతాన్ని ఆయా పార్టీలు అన్ని పంచుకోగా మెజారిటీ బై మైనారిటీ సూత్రం ప్రకారం చాలా తక్కువ ఓట్లతో కూడా గెలుపు సొంతం చేసుకోవచ్చు.

ఈ కారణం ఆయా పార్టీలకు కలిసి వచ్చేది కాబట్టి పట్టణాలలో ఓటింగ్ శాతం పెంపు లేకున్నా పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎంత తక్కువ ఓటింగ్ జరుగుతుందో అంతే తక్కువ ఓట్లతో ఒక పార్టీ గెలవడం సులభం అవుతుంది. ఇక ఇక్కడ ఓటింగ్ శాతమే 50 ఉన్నప్పుడు దానినే అన్ని పార్టీలు పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక గెలిచిన అభ్యర్థికి వచ్చే ఓట్లెన్ని.. ఆ గెలుపు ఒక గెలుపేనా! ఇలాంటి ప్రశ్నలు అనేకం ఎన్నికల సమయంలో తలెత్తుతూనే ఉన్నాయి. రాజకీయంగా ఇది కలిసివస్తుంది కాబట్టి దీనిపై వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపరు. మరి ప్రజలు ఎందుకు ఓట్లు వేయరు అనేది వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాయి ఆయా ఎన్నిక సంఘాలు.

గత ఆరుసార్లు జరిగిన ఎన్నికలలో తిరుపతి లో ఓటింగ్ శాతం 50 దాటింది ఒక్కసారి మాత్రమే అంటే పట్టణాలలో ఓటింగ్ పై ఎంత ఆసక్తి ఉందొ అర్ధం అవుతుంది. తమ ప్రాంత అభివృద్ధి కోసం నేతలను ఎన్నుకునేందుకు ఓటు వేయడానికి ఆసక్తి లేకపోతే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది. ఈ విషయం పై ప్రజలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలు ఓట్లను చీల్చి గెలుపు సులువు చేసుకునే కుతంత్రాలకు ప్రజలే సరైన సమాధానం కనుక్కోవాలి అని నిపుణులు చెపుతున్నారు. దేశంలో నే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నది కూడా ఒక కుటిల రాజకీయమే అని ప్రజలు గుర్తించాలని వారు సూచిస్తున్నారు. అలా చేయని పక్షంలో పది శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ కూడా అధికారంలోకి వచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాంటిదే జరిగితే అనాకానీ పార్టీలు కూడా తెరపైకి వచ్చి ప్రాంతాలను, రాష్ట్రాలను, దేశాన్ని కూడా  దోచుకు తింటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: