సెప్టెంబర్ 23 వ తేదీ మా పార్టీకి ముఖ్యమైన రోజు అని జగన్మోహన్ రెడ్డిని కొన్ని కేసుల్లో జైల్లో పెడితే ఈరోజు బెయిల్ పై బయటకు వచ్చిన రోజు అని ఎంపీ రఘురామ అన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ సుధాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది అని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన సుధాకర్ కి మా పార్టీ నాయకుడి సంబంధించిన బంధువు ఒకరి తో సంబంధాలు ఉన్నాయి అని అంటున్నారు అని మా ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువు ఇందులో ఉండరని నేను నమ్మతున్న అంటూ వ్యాఖ్యానించారు.

త్వరలో బయటపడుతుంది,ప్రతిపక్షాలు మాట్లాడడం లో తప్పు లేదు అని ఆయన పేర్కొన్నారు. లారీ ఇసుక 20 వేల నుండి ముప్పవేలు అయ్యింది అని ఆయన విమర్శించారు. ఇసుక పాలసిలో విషయంలో మా ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయ్యింది అని మండిపడ్డారు. ఇసుక తరలిస్తున్న లారీలకు ఈ-చలానా ఉండాలి...అవి ఏవి కూడా ఉండడం లేదు అన్నారు. మైనర్ మినరల్స్ కు గత ఏడాది 2500 కోట్లు మించి రాలేదు...ఇపుడేమే 2900 కోట్లు పెట్టారు టెండరింగ్ ఎలా వస్తుంది అని ప్రశ్నించారు.

రాజస్థాన్ లో మైనింగ్ విధానం ఏపీ లో పెట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు. మైనింగ్ లో 10 నుండి 15 శాతం మాత్రమే పర్యవరణ అనుమతులు ఉన్నాయి అని ఆయన విమర్శలు చేసారు. ప్రభుత్వం పర్యవరణ అనుమతులు ఇస్తే దాని ఆదాయం ప్రైవేట్ వారికి మాత్రమే వస్తుంది అన్నారు. ప్రజల్లో అనుమానాలు నీలి నీడలు కమ్ముకున్నాయి అని సినిమా టిక్కెట్లు మనం అమ్మడం ఏంటి అని ప్రశ్నించారు. సినిమా హాల్స్ టికెట్ కొట్టే బాధ్యత మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 చెప్తుంది..ఒక మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకూడదని అన్నారు. పూజారులకు ఇండోమెంట్ నుండి జీతాలు ఇస్తారు అది ప్రభుత్వం ఖర్చు కాదు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap