ఏపీసీఎం జగన్ స్వయంగా సచివాలయ పనితీరుపై సమీక్షించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. అదికూడా ఆకస్మికంగా ఈ సమీక్షలు ఉంటాయని, కనీసం స్థానిక ఎమ్మెల్యే లకు కూడా సమాచారం లేకుండా తాను వస్తాను అని ఏపీసీఎం స్పష్టం చేశారు. దీనితో ఆయా ప్రాంతాలలో స్థానిక నాయకత్వం కాస్త ఆందోళనలో ఉంది. ఎవరైనా పలానా పధకం అందలేదు అంటే జగన్ తక్షణమే ఆయా అధికారులపై అలాగే తన ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరి పనితీరు నచ్చకపోయినా తరువాత ఎన్నికలలో వారిని దూరంగా ఉంచే విధంగా చర్యలు ఉండవచ్చని ఇప్పటికే పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాటలు.

తాజాగా మళ్ళీ ఏపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో ఈ నిర్ణయం  ప్రకటించడంతో ఇది కూడా కిషోర్ ఆలోచన లోంచి వచ్చిందే అని ఆయా వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. ఇప్పటికే జగన్ ప్రభుత్వం లోనే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వాళ్ళను చూస్తున్నాం, ఈ సంఖ్య మరీ పెరిగిపోతుందేమో అనేది కూడా వినిపిస్తుంది. పనితీరు బాగాలేని వారిని నిర్దాక్షిణంగా తదుపరి ఎన్నికలలో పక్కన పెట్టేస్తారని, పార్టీకోసం కష్టపడే వారికే టిక్కెట్లు ఇస్తారని తెలుస్తుంది. అలా అయితేనే పార్టీలో దొంగలు, వ్యతిరేక వాదుల కు చెక్ పెట్టవచ్చని అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ప్రజల వద్దకు అన్ని చేరుస్తున్నప్పటికీ మధ్య నాయకత్వం సరిలేకపోయినా కూడా ప్రభుత్వం పై తప్పు ఉన్నట్టే కాబట్టి దానిని తదుపరి ఎన్నికల లోపే సరిదిద్దుకోవాలని కిషోర్ జగన్ కు సూచించడంతో ఈ ప్రత్యక్ష సమీక్ష తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో పార్టీ వ్యతిరేక శక్తులను సులభంగా కనిపెట్టి వారిని తదుపరి ఎన్నికలలో దూరంగా పెట్టవచ్చని, అలాగే ప్రజలకు అధినాయకత్వానికి మధ్య ఉన్న చిన్న చిన్న గ్యాప్ లను కూడా ఈ సమీక్షల ద్వారా పూడ్చివేయొచ్చని పార్టీ భావిస్తుంది. తద్వారా ఉన్న  కొద్దిపాటి నెగిటివిటీని కూడా తీసేసుకొని ఎన్నికలకు ధైర్యంగా వెళ్ళవచ్చు అనేది ప్రణాళికగా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల లోపు ఇది పూర్తి చేసి తీరాలన్నది పార్టీ ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: