తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన త‌రువాత దూకుడును మ‌రింత‌గా పెంచాడు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పార్టీని విమ‌ర్శించ‌డంలో, ప్ర‌భుత్వం చేసిన త‌ప్పును నిల‌దీయ‌డంలో కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి ముందుంటాడు. అవ‌కాశం దొరిక‌న‌ప్పుడ‌ల్లా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్ట్రాలు సందిస్తూ అధికార పార్టీని ఇరాకాటంలో పెట్టేందుకు చూస్తారు. అనూహ్యంగా కొన్ని వ్య‌వ‌హారాలు రేవంత్‌కు అనూక‌లంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ వ్య‌వ‌హారంలో రేవంత్ విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. ఎందుకంటే విమ‌ర్శ‌ల విష‌యంలో ఎక్కువ‌గా స్పందించ‌ని కేటీఆర్.. రేవంత్ రెడ్డి విష‌యంలో ఎక్కువ‌గా స్పందిస్తున్నాడ‌నే చెప్పాలి.


  అయితే, కేటీఆర్ ఎక్కువ స్పందించ‌డం వ‌ల్ల కేటీఆర్‌కు క‌లిసి వ‌స్తోంది. మంత్రి కేటీఆర్‌, రేవంత్ రెడ్డి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ను త‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకున్నారు. రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ సెట్ చేసిన ట్రెండ్‌ను ఫాలో అయ్యేలా చేయ‌డంలో టీపీసీసీ సార‌థి రేవంత్ రెడ్డి స‌క్సెస్ అయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కాకముందు ఆయ‌న గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కేటీఆర్‌. కానీ ప్ర‌స్తుతం దానికి భిన్నంగా న‌డుస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌తి విమ‌ర్శ‌కు రిప్లై ఇచ్చేందుకు కేటీఆర్ ముందుకు వ‌స్తున్నాడు.


   డ్ర‌గ్స్ విష‌యంలో  కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్‌ను విసిరారు రేవంత్ రెడ్డి. మ‌రో అడుగు ముందుకు వేసి గ‌న్‌పార్క్‌కు చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు కూడా. శ‌శిథ‌రూర్ పై రేవంత్ చేసిన కామెంట్‌ను ముందుకు తీసుకువ‌చ్చేందుకు కేటీఆర్ ప్ర‌యత్నించ‌డంతో.. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు.. దీంతో శ‌శిథ‌రూర్ మ్యాట‌ర్ ప‌క్క‌కు పోయి.. వీరిద్ద‌రి మ‌ధ్య వైట్ ఛాలెంజ్ ఫైట్ స్టార్ట్ అయింది. అలాగే గ‌తంలో రేవంత్ రెడ్డి విష‌యంలో పెద్ద‌గా రియాక్ట్ కానీ కేటీఆర్ ఇప్ప‌డు ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. దీంతో అన‌వ‌స‌రంగా రేవంత్ రెడ్డికి.. కేటీఆర్ ఛాన్స్ ఇస్తున్నాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: