గత కొద్ది కాలంగా  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో తమ రాజకీయ వ్యూహాలను మార్చేసిందని చెప్పవచ్చు. గత ఏడున్నర సంవత్సరాల నుంచి  ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లలో ఎలాగైనా విజయం సాధించాలని దేశంలో వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు పోతుంది. ఈ విధంగా మాకు రాజకీయాన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీలోకి సిపిఐ యువ నాయకుడు కన్నయ్య రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య కాలంలో  భవిష్యత్తు కమ్యూనిస్టు పార్టీకి యువ నాయకులు కావాలని సురవరం సుధాకర్ రెడ్డి, ఇలా బడా నాయకులు  అంత వృద్ధులు అయిపోవడంతో పార్టీకి యువతరం కావాలని కన్నయ్యను  ముందుకు తీసుకొచ్చారు నారాయణ.

బీహార్లో తన వ్యవహారశైలి విద్యార్థి ఉద్యమాల్లో ఆయన పనిచేసిన తీరును  చూసినటువంటి నారాయణ సిపిఐ పార్టీ తన అవసరమని  పార్టీలో పని చేయడానికి అర్హత కలిగి ఉన్నాడని  అతని ముందుకు తీసుకువచ్చి, దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే విధంగా చేసి అతని కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించి ఇచ్చింది నారాయణ అని చెప్పవచ్చు. అతనికి భారీ ఘనస్వాగతం, రెడ్ సెల్యూట్ లో  ఇలా ఎన్నో చేసి అతను ఒక పెద్ద నాయకుడిగా తయారుచేసింది సిపిఐ పార్టీ. ఇలా పార్టీలో ఉండి ఎంతో పేరు సంపాదించిన కన్నయ్య కుమార్ఆ పార్టీ నుండి బహిష్కరణకు కూడా గురయ్యారు.

ఇప్పుడు ఆ కన్నయ్య కుమార్  సొంతపార్టీ నాయకుని కొట్టి గందరగోళానికి గురి చేసి ఈ కన్నయ్య కుమార్ గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ కుమార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఈనెల 28 లేదా అక్టోబర్ 2న వీరిద్దరినీ పార్టీలో చేర్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీళ్లను ముందు పెట్టుకొని  ముందుకు వెళ్తున్నట్టు  తెలుస్తోంది. అయితే దీనిపై సీబీఐ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: