ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్న ఒకే ఒక అంశం.. కుప్పంలో ప‌రిస్థితి ఏంటి? అని..! అంతేకాదు.. వైసీపీకి చెందిన ప‌ల‌వురు మంత్రులు కూడా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో బాబు గెలిస్తే.. రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని.. మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, కుప్పంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుపై ఓ మ‌హిళా నేత‌ను పెట్టి గెలిపించుకుంటామ‌ని.. ఇదే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం.. నారాయ‌ణ స్వామి.. మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఇక‌, ఇదే జిల్లాకు చెందిన‌.. మ‌రో మంత్రి, సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి కూడా బాబును కుప్పంలో ఓడించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు.

దీంతో ఇప్పుడు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు.. హాట్ హాట్‌గా మారాయి. మ‌రి దీనికి రీజ‌నేంటి?  మంత్రులు ఊరికేనే క‌బుర్లుచెప్పారా?  లేక నిజ‌ముందా? అనేది చ‌ర్చ‌కు దారితీసింతి. తాజాగా వెలుగు చూసిన‌.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు ప‌రిస్థితి ఒకింత ఇబ్బందుల్లో ప‌డిందనే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తాజా ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు  ప్రాతినిథ్యం వహిస్తున్న  టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర నియోజ‌క‌వ‌ర్గం (పొన్నూరు)లోను, చింతమనేని ప్రభాకర్(దెందులూరు), ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(పాల‌కొల్లు), బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు.

కానీ, చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో మాత్రం కేవ‌లం 3 ఎంపీటీసీల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, జెడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. కుప్పంలో నాలుగింటిలో ఒక్క జెడ్పీటీసీని కూడా ద‌క్కించుకోలే దు.  ఆరు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా ఏడు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ ఏడు జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఉండడం గ‌మ‌నార్హం. సీనియర్‌ నాయకుడు, ఇటీవ‌ల తీవ్ర వివాద‌మైన‌ అయ్యన్నపాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జెడ్పీటీసీని గెలిపించుకున్నారు.

అయితే చంద్రబాబు కుప్పంలో ఒక్క జెడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించే వైసీపీ మంత్రులు అలా వ్యాఖ్యానించార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే.. టీడీపీ మాత్రం మేం బ‌హిష్క‌రించాం.. క‌నుక ఇలాంటి ఫ‌లితం వ‌చ్చింద‌ని చెబుతోంది. కానీ, వాస్త‌వం.. గ‌మ‌నిస్తే.. కొంత డౌన్ ట్రెండ్ అయితే.. క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: