ఏపీలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక కామెంట్స్ చేసారు. రాష్ట్రం నుంచి వేల కోట్ల రూపల హెరాయిన్ అక్రమ రవాణా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరో కేంద్ర నిఘా సంస్థలు  తేల్చాలి అని ఆయన అన్నారు. హెరాయిన్ 72 వేల కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ పట్టుబడినట్లు పత్రిక లో వస్తుంది అని దీని వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న పోర్టు లు తెలుగు వారి అధీనంలో ఉండగా వాటన్నిటిని రెండేళ్ల వ్యవధిలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు అప్పగిస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

నెత్తి మీద ఉన్న జుట్టు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే రేషన్ తక్కువ కు కొనుగోలు చేసి కాకినాడ పోర్టు నుండి తరలిపోతోంది అని మంత్రులు, ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. మత్తు మందుల వల్ల రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆరోపించారు. అధికారుల కారులో మత్తుమందు డబ్బులు విచ్చలవిడిగా రవాణా అవుతుందట,ఎవరు వీల్లంతా అని ఆయన ప్రశ్నించారు. కాగా ఏపీలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కాసేపటి క్రితం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేసారు. కావాలనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని డీజీపీ గౌతం సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యలు చేసారు. ఈ డ్రగ్స్ కి ఏపీకి సంబంధం లేదని కేవలం రవాణా కోసం అడ్డ్రెస్ పెట్టుకున్నారు అని ఆయన తెలిపారు. దీని మీద తాము నిఘా ఉంచామని అధికారుల వైఫల్యం అసలు ఏ మాత్రం లేదన్నారు. ఎవరు అయినా దీని వెనుక ఉన్నారని బయటపడితే మాత్రం కచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: