అంతరిక్షానికి సంబంధించిన ఏదైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే చాలు ఇక ఆ సినిమాను ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అంతే కాదు కొత్త టెక్నాలజీకి సంబంధించి సినిమాల ద్వారా సరికొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.  ఇక ఇటీవల కాలంలో వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా ఎంతో మంది దర్శకులు అంతరిక్షం అనే కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే వరుణ్తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం అనే సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఒకసారి స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.



 సాధారణంగా సినిమాల్లో స్పేస్ లోకి వెళ్ళగానే భూమి ఆకర్షణ శక్తి ఉండదు.. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి గాలి లేకపోయినప్పటికీ గాలిలో తేలుతున్నట్లుగా ఉంటారు. అయితే అంతరిక్షం లోకి వెళ్లి ఇలాంటి అనుభూతిని పొందాలని ఎవరూ అనుకోరు చెప్పండి. అయితే ఇలాంటిది మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రాబోతోంది. అయితే దీని కోసం అంతరిక్షంలోకి వెళ్లాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే సరిపోతుంది.  విశాఖలో ఒక సరికొత్త ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది.  కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్లాన్ చేయగా అటు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తుంది.



 స్పేస్ ఎక్స్పీరియన్స్ ని ప్రజలందరిలో పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇక ఈ సరికొత్త ప్రాజెక్టు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తో  కలిసి ప్లానిటోరియం అనే ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి ఇక ఈ సెంటర్ సిద్ధం అయిన తర్వాత..  ఇక దీంట్లోకి వెళ్లిన జనాలు స్పేస్ షిప్ లో అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా అయితే గాలి లేకుండానే జీరో గ్రావిటీ వల్ల తేలుతూ ఉంటారో..  అలాంటి అనుభూతిని పొందుతారు అని తెలుస్తోంది. ఇలాంటి అనుభూతి పొందే విధంగా ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టులోని స్పెషలిటీ అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: