సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటామ్. కొంత మంది దొంగలు దోపిడీ చేయడానికి వచ్చి ఇక దొరికి పోవడంతో మళ్ళి దొంగే దొంగ అని అరుస్తూ ఉంటారు. ఇలా పాకిస్తాన్ పరిస్థితి కూడా ప్రస్తుతం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్న ట్లుగా  ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.  ఎందుకంటే వివిధ దేశాల భద్రతకు భంగం కలిగించడంతో ఎప్పుడూ పాకిస్తాన్ ముందు ఉంటుంది. ఉగ్రవాదులతో ఎప్పుడు వివిధ దేశాల్లో కుట్రలు చేసి మారణహోమాలు సృష్టించడమే కాదు రక్షణ పరమైన రహస్యాలను కూడా ఎప్పుడూ తస్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇక ఇలాంటి రహస్యాలను దొంగలించి వివిధ దేశాలకు అమ్ముడు పోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది.


 అయితే ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడ్డాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఎప్పుడూ తమని తాము మంచి వాళ్ళం అంటూ ప్రపంచ దేశాల ముందు కవరింగ్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు భారత్కు సంబంధించిన ఎన్నో రహస్యాలను దొంగలించి చైనా సహా మరికొన్ని దేశాలకు అమ్మడం లాంటివి కూడా చేసి సొమ్ము చేసుకుంది పాకిస్తాన్. ఇక ఇప్పుడు అలాంటి పాకిస్తాన్ కి ఊహించని షాక్ తగిలినట్లు ప్రస్తుతం తెలుస్తోంది.



 ఇటీవలే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సైబర్ డేటా డి డి ఓ ఎస్ ని పూర్తిగా ఎవరో దొంగలించి నట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ తమ సైబర్ డేటాను దొంగిలించింది రా అంటూ ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం.  అయితే పూర్తిగా ఇలా సైబర్ డేటా దొంగిలించబడినది అని చెప్పుకోకుండా కవరింగ్ ఇచ్చుకోవడానికి తాము ఇలాంటి సమస్యలను ఎదుర్కోగలం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్. కానీ అక్కడి లోకల్ మీడియాలో మాత్రం పూర్తిగా పాకిస్తాన్ డేటా దొంగిలించబడింది అన్న విషయాన్ని చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: