ఎన్నో ఏళ్ల నుండి భారత్ లో ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకున్న బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.  ప్రస్తుతం ఇక భారత బీమా రంగంలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కొత్త పాలసీలను తీసుకు వస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పుడూ తమ పాలసీదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ముందుంటుంది.  ఇప్పటికే ఎన్నో రకాల సేవలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. చాలామంది ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బీమా రంగ సంస్థలో పాలసీ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.



 ఒకవేళ మీరు ఇప్పటికే ఎల్ఐసి పాలసీ తీసుకుని ఉంటే ఇక మనం చెప్పుకునే వార్త మీకోసం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు పాలసీ కలిగి ఉంటే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.  ఒకవేళ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలో పాలసీ ఉండి ఇక ఆ పాలసీ పాన్ కార్డు లింక్ లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకనే వెంటనే మీ పాలసీని పాన్ కార్డు తో లింక్ చేసుకోవడం ఎంతో మంచిది. ఇలా పాలసీదారులు అందరూ పాన్ నెంబర్ ను ఎల్ఐసి పాలసీతో లింక్ చేసుకోవాలని ఇటీవలే సంస్థ కోరింది.  అయితే ఈ అనుసంధాన ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి అని టెన్షన్ పడుతున్నారా.



 మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో కూడా పాన్ కార్డ్ ఎల్ఐసి పాలసీ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనికోసం మీరు ఎల్ఐసి వెబ్ సైట్ కి వెళ్తే సరిపోతుంది. అక్కడ ఎల్ఐసి పాలసీ తో పాన్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రెండింటినీ అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది  ఇక ఇలా అనుసంధానం చేసుకునేందుకు అటు పాన్ కార్డు నెంబర్ తో పాటు పాలసీ వివరాలు మొబైల్ నెంబర్ వంటివి కూడా అందుబాటులో ఉంచుకోవడం మంచిది.  ఇంకెందుకాలస్యం ఒకవేళ మీ పాలసీ పాన్ కార్డుకు లింక్ అయి లేకపోతే వెంటనే చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: