ప్ర‌స్తుతం ఇదే అంశం.. ఇటు ప్ర‌తిప‌క్షం టీడీపీ, అటు అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. తాజాగా.. శాస‌న స‌భ ప్రివిలేజ్ క‌మిటీ.. టీడీపీ ఎమ్మెల్యేలు, వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకు న్న నాయ‌కులు.. అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల రామానాయుడుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుగా.. సిఫార సు చేసింది. అచ్చెన్నాయుడు.. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడార‌నేది ప్ర‌ధాన అభియోగం. దీనిపై స్పీక‌రే స్వ‌యంగా ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్ప‌టికే ప్రివిలేజ్ క‌మిటీ చైర్మ‌న్‌.. కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి సార‌థ్యంలో విచార‌ణ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో తాను.. ఉద్దేశ పూర్వ‌కంగా ఏమీ అన‌లేద‌న్నారు.. ఒక‌వేళ‌.. సీతారాం.. నొచ్చుకుని ఉంటే క్షమించమ‌ని కోరుతున్న‌ట్టు కూడా చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. అచ్చ‌న్న‌పై చ‌ర్య‌ల‌కు క‌మిటీ సిఫార‌సు చేసిం ది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం మేరకు.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో స‌భ‌లో అచ్చ‌న్న‌కు మైక్ ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించారు. ఇక‌, నిమ్మ‌ల రామానాయుడు ప‌రిస్థితి కూడా ఇంతే.. స‌భ‌లో ప్ర‌సంగిస్తూ.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశార‌నేది ప్ర‌ధాన అభియోగం. అయితే.. ఈయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌లేదు. అయిన్ప‌టికీ.. త‌న పంథాలోనే మాట్లాడాన‌ని.. ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. నిమ్మ‌ల‌కు కూడా అదే శిక్ష‌ను ఖ‌రారు చేస్తూ.. ప్రివిలేజ్ క‌మిటీ స్పీక‌ర్‌కు సిఫార‌సు చేసిం ది. త్వ‌ర‌లోనే వ‌ర్షాకాలు స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స్పీక‌ర్ దీనిపై తొలిరోజే నిర్ణ‌యం తీసుకుంటార‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు స్పీక‌ర్ దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది.. ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్య‌క్ష స్థానంలో ఉండి.. నొచ్చుకుని ఉంటే క్ష‌మాప ణ‌లు చెబుతున్నా.. అని చెప్పిన అచ్చెన్న‌పై  వేటు వేస్తారా?  అనేది చ‌ర్చ‌గా మారింది.

అంతేకాదు.. సొంత జిల్లా శ్రీకాకుళానికి చెందిన అచ్చెన్న‌పై వేటు వేస్తే.. స్థానికంగా సీతారాంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉండ‌దా? అనేది చ‌ర్చ‌. మ‌రి దీనిపై సీతారాం ఏం చేస్తారో చూడాలి. క్ష‌మాప‌ణ‌లు చెప్పారు క‌నుక‌.. వ‌దిలేస్తార‌ని.. కొంద‌రు అంటుంటే.. ఒక‌టి రెండు రోజుల‌కే శిక్ష‌ను ప‌రిమితం చేస్తార‌ని.. మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా.. టీడీపీ వాయిస్ క‌ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: