గెలుస్తాం.. నిలుస్తాం.. అధికారం చేప‌డ‌తాం.. అంటూ.. బీజేపీ నేత‌లు.. ఎక్క‌డ మైకు ప‌ట్టుకున్నా.. చెబుతు న్నారు. ఇక‌, రాష్ట్ర బీజేపీ సార‌థి.. సోము వీర్రాజైతే.. అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్టు.. మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్న‌ట్టు క‌ల‌లు కంటున్నారు. అంతేకాదు.. మా ప్ర‌భుత్వం వ‌స్తే.. మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ.. ప్ర‌జ‌ల్లో ఇటీవ‌ల కామెంట్లు చేస్తున్నారు. ఇవ‌న్నీ చూస్తే.. ఆలూ.. లేదు.. చూలూ లేదు.. అనే సామెత వినిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్ట‌కుండా.. కేడ‌ర్ లేకుండా.. పార్టీని అధికారంలోకి ఎలా తీసుకువ‌స్తారో.. సోముకే తెలియాల‌ని పెద‌వి విరుస్తున్నారు.

అంతేకాదు.. ఇప్ప‌టికి ఈ ఏడాది.. మూడు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. 2019 వ‌దిలేసినా.. అంటే.. అప్ప టికి సోముకు ప‌గ్గాలు లేవు క‌నుక‌... ఇప్పుడు ఆయ‌న హ‌యాంలోనే మూడు ఎన్నిక‌లు జ‌రిగాయి. పంచాయ తీ, మునిసిపాలిటీ, ప‌రిష‌త్ ఎన్నిక‌లు సోము క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయి. వీటిలోనూ పంచాయితీ ఎన్నిక‌లు పార్టీ గుర్తుపై జ‌రిగేవి కాదు క‌నుక‌.. మిగిలిన రెండు ఎన్నిక‌ల‌ను తీసుకున్నా.. బీజేపీ అట్ట‌ర్ ఫ్లాప్ అయిపో యింది. అదేస‌మ‌యంలో సోము వారి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మ‌రో పెద్ద ఎన్నిక తిరుప‌తిపార్ల‌మెంటు ఉప పోరు. దీనికి ఆయ‌న బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. చ‌మ‌టోడ్చారు. ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షణ‌లు చేశారు. త‌న హవాను నిలుపుకొనేందుకు ప్ర‌య‌త్నించారు.

అయితే. ఒక్క‌టంటే.. ఒక్క చోట కూడా సోము స‌త్తా నిరూపించుకోలేక పోయారు. స‌రే.. రాజ‌కీయాలు కాబ‌ట్టి.. అధికార పార్టీ దూకుడుగా ఉంది కాబ‌ట్టి.. ప‌రాజ‌యం పాలైంద‌ని అనుకున్నా.. అస‌లు పార్టీలోను.. సోము లోను.. అంత‌ర్మ‌థ‌నం ఎక్క‌డ‌? అనేది ఇప్పుడుప్ర‌ధాన ప్ర‌శ్న‌. జరిగిన ఎన్నిక‌ల్లో ఎదురైన ఘోర ప‌రాభ‌వాల‌పై పార్టీలో చ‌ర్చించారా?  నేత‌ల‌ను కూర్చోబెట్టిదీనిపై దృష్టి పెట్టారా?  ఏం చేస్తే పార్టీ పుంజుకుంటుంద‌నే విష‌యంపై ఆలోచించారా?  అంటే.. అదేమీ లేదు. కేవ‌లం మోడీ హ‌వాను న‌మ్ము కున్నారు. లేక పోతే.. పొత్తు పార్టీ జ‌న‌సేన‌ను న‌మ్ముకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

కానీ.. ఇప్పుడు ఏపీ ఉన్న ప‌రిస్థితిలో మోడీని న‌మ్మ‌డం లేదు. ఏపీకి కేంద్రం ఏమీ చేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. మోడీని దింపేయాల‌న్న విప‌క్షాల పిలుపున‌కు ఏపీ ప్ర‌జ‌లు కూడా రెడీ అంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక‌, పొత్తు పార్టీని తీసుకున్నా.. త‌ను బ‌లోపేతం అయ్యేందుకు జ‌న‌సేన నాయ‌కుడు.. ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు తప్ప‌.. బీజేపీతో క‌లిసి వెళ్తే.. మైనార్టీ ఓటు బ్యాంకు.. ఎస్సీ, ఎస్టీలు దూర‌మ‌వుతార‌ని అనుకున్నారు. ఈ నేప‌థ్యంలోఈ ఇద్ద‌రినీ న‌మ్ముకున్న సోము.. అధికారంలోకి ఎలా వ‌స్తారో.. ఆయ‌నే చెప్పాలి. ఇప్ప‌టికైనా.. క్షేత్ర‌స్తాయిలో ప‌రిస్థితిని అంచనా వేసుకుని.. పొరుగు రాష్ట్రం తెలంగాణ బీజేపీ సార‌థి.. బండి సంజ‌య్  లాంటోడు ఎవ‌రైనా ఏపీ బీజేపీకి దొరికేంత కాలం ఆ పార్టీ ఇక్క‌డ అధికారంలోకి వ‌స్తుంద‌న్న‌ది కల‌గానే మిగిలిపోనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp