తాజాగా తాలిబన్ లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో నేతలుగా పరిచయం చేయబడ్డ వారందరు పెద్ద పెద్ద నేరస్తులే. ఈ నేతలను చూసి ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఎందుకంటే వారందరు ఎప్పటి నుండో వెతుకుతున్న ముష్కరులు, ఇలా ఆఫ్ఘన్ నేతలుగా కొత్త కేబినెట్ లో ఉండటం తో ప్రపంచ పరిస్థితి ఒక్కసారి కళ్ళముందు కనిపించినట్టుగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఆఫ్ఘన్ లో షరియా చట్టాలు అమలులోకి వచ్చినట్టే ఉన్నాయి. మహిళలను ఇంటికి పరిమితం చేసేందుకు తాలిబన్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయా సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని మాన్పించి ఇళ్లకు తరలిస్తున్నారు.

తాజాగా ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా ఉన్న మహిళను తొలగించి ఆ స్థానంలో డిగ్రీ చేసిన వ్యక్తిని వైస్ ఛాన్సులర్ గా నియమించారు. దీనిని బట్టే విద్య పట్ల తాలిబన్ లకు ఉన్న అవగాహన తెలిసొస్తుంది అని పలువురు విమర్శిస్తున్నారు. ప్రపంచానికి మారాము అని చెప్పుకుంటూ అలాంటి సంఘటన ఒక్కటి కూడా లేకుండా ప్రవర్తించడం తాలిబన్ లకు అలవాటుగా మారిపోయింది. ఒకపక్క షరియా చట్టాలే అమలు అవుతాయి అంటారు. మరో పక్క మహిళలకు పూర్తి స్వాతంత్రం ఇస్తాం అంటున్నారు. అసలు ఈ రెంటికి పొంతన ఎలా కుదురుతుందో వల్లే చెప్పాలి. తాలిబన్ రాజ్యం ఏర్పాటు చేసిన తరువాత కూడా కొందరు మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమకు స్వాతంత్రం కావాలని, తమ హక్కులను తాలిబన్ లు కాలరాస్తారని నిరసనలు వెళ్లబుచ్చుతూనే ఉన్నారు.

దానికి అనుగుణంగానే తాలిబన్లు కూడా మహిళలను నిరసనలు చేయరాదని హెచ్చరిస్తూనే ఉన్నారు. షరియా చట్టాల ప్రకారం శిక్షలు కూడా భయానకంగానే ఉంటాయి. ఒక్కసారి తాలిబన్ లను ప్రపంచం గుర్తిస్తే చట్టాలు పూర్తిగా అమలులోకి తెచ్చి, వారి ఇష్టానుసారంగా పరిపాలన సాగించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు మహిళలకు వీలైనంత మెల్లగానే నిరసనలు చేయొద్దని చెప్పుకొస్తున్నారు తాలిబన్ లు, అదికూడా ప్రపంచం తమను గమనిస్తుంది అనే భయంతో మాత్రమే. ఇక అక్కడి ఇతర ఆఫ్ఘన్ ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. ఆహార కొరత, నగదు సరిపడా చలామణి లో లేక దేశం విడిచి వెళ్లలేక చావలేక బ్రతుకుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే దేశంలో ప్రధాన నగరాలలో విద్యుత్ సరఫరా కూడా లేకుండా చేయాలని చూసినా అది జరగలేదు. కనీసం ఆ సౌకర్యం కూడా ఉండకుండా ప్రజలను ఆటవికంగా పరిపాలించడమే వారి లక్ష్యం అని చెప్పకనే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: