బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేకపోయినా భారతీయ జనతా పార్టీ దూకుడుగా అడుగులు వేయడంతో సీఎం కేసీఆర్ దాదాపు ఏడాది నుంచి ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోయినా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ప్రభావం ఎక్కువగానే కనబడింది.

అయితే ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఎంతవరకు బలోపేతమవుతుంది ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఏంటనే దానిపై మాత్రం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పాదయాత్ర చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లి దాదాపుగా పది రోజుల పాటు ఉండే వచ్చారు. ఈ పాదయాత్రలో బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసి రావడం సంచలనం అయింది.

బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఘాటుగా విమర్శలు చేస్తున్న తరుణంలో అలాగే బిజెపి నేతలు ఘాటుగా విమర్శలు చేసే సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లడం ఇప్పుడు సంచలనాలకు తావిస్తోంది. సీఎం కేసీఆర్ ఎవరిని కలుస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా కేంద్ర జల శక్తి శాఖ మంత్రిని అలాగే కేంద్ర హోంమంత్రి మరోసారి కలిసే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. దీనితో బండి సంజయ్ ఆరోపణలు చేసినా సరే అవి పెద్దగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని టిఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి అని అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp