ఆంధ్రులు అభిమాన‌ధ‌నులు.. అవును అభిమాన‌మే వారి ఆస్తి. న‌చ్చితే పొరుగింటి పిల్ల అయినా నెత్తిన పెట్టుకుంటారు. ఈ కోవ‌లో స‌మంత రుత్ ప్ర‌భూ ఈ కోవ‌లో కొంత కాలం భూమికా చావ్లా ఇప్పుడీ కోవ‌లోనే సాయి ప‌ల్ల‌వి. పేరుతో పాటు వివాదాలూ ఆమె వెంటే ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పే వివాదం అంత పెద్ద‌ది కాకున్నా కాస్త ఎవ్వ‌రైనా నొచ్చుకునే విష‌య‌మే!


కొన్ని ప‌నులు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తాయి. కొన్ని ఆనందింప‌జేస్తాయి. సినిమా ఎవ్వ‌రిది అయినా స‌రే మేల్ ఓరియెంటెడ్ ఇండ స్ట్రీ లో  ఇంకా చెప్పాలంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక అమ్మాయి ఇంత‌గా రాణించ‌డం, స్కిన్ షోకు తావివ్వ‌కుండా సినిమాలు చేసు కుంటూ వెళ్ల‌డం అన్న‌ది అభినందించ‌ద‌గ్గ విష‌యం. యాక్టింగ్ ప‌రంగా సాయి ప‌ల్ల‌వి ఎన్నో మార్కులు ఎప్పుడో కొట్టేశారు. అదే స్థాయిలో డ్యాన్స్ ప‌రంగా కూడా! తాజా చిత్రం ల‌వ్ స్టోరీ అన్న‌ది వీటికి కేవ‌లం కొన‌సాగింపు మాత్ర‌మే! ముఖ్యంగా సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో క‌నిపించే తీరు, ఆమె పాత్ర న‌డ‌వ‌డి వీటిపైనే ఎక్కువ‌గా అభిమానులు ఫోక‌స్ పెట్టారు. తాను శేఖ‌ర్ స్కూల్ స్టూడెంట్ ని అని ఆమె చెప్పారు. అక్క‌డ నేర్చుకున్న క్ర‌మ‌శిక్ష‌ణే ఇప్పుడు త‌న‌ను మిగ‌తా ప్రాజెక్టుల విష‌యంలో కూడా ఉప‌యోప‌డుతోంద‌ని కూడా అంటున్నారు.

తాజా వివాదం ఏమిటంటే...........
సాయి ప‌ల్ల‌వి మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. రేప‌టి వేళ విడుద‌ల‌య్యే ల‌వ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీల‌పై ఆమె బొ మ్మ‌నే ఎక్కువ‌గా ఫోకస్ చేస్తున్నారు అభిమానులు. కొన్ని ఫ్లెక్సీల‌లో చైతూ ఫొటో కూడా ముద్రించ‌లేదు. దీంతో అక్కినేని అభిమా నులు కొంద‌రు హ‌ర్ట్ అవుతున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకు వ‌చ్చింది మాత్రం సాయిప‌ల్ల‌వినే! అన్న‌ది కాద‌న‌లే ని వాస్త‌వం. అయితే మొన్న‌టి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సాయి ప‌ల్ల‌వినే హైలెట్ అయింది. చిరు కూడా ఆమెనే అదే ప‌నిగా పొగిడా రు కూడా! దీంతో చిరు మాట‌లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాను ఫిదా సినిమా చూసి ఎంతో ఇంప్ర‌స్ అయ్యాన‌ని కూడా చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఏదేమైన‌ప్ప‌టికీ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల నుంచి వ‌స్తున్న ఈ చిత్రం గురించి ఇప్ప‌టికే ఎన్నో అం చ‌నాలున్న నేప‌థ్యంలో వివాదాలు ఎలా ఉన్నా, వ్యాఖ్యలు ఎలా ఉన్నా చాలా కాలం నుంచి సక్సెస్ కోరుకుం టున్న చై కూ మంచి కిక్ ఇవ్వాల‌నే ఆశిద్దాం. అలానే సాయి ప‌ల్ల‌వి న‌ట‌న మ‌రో స్థాయికి చేరుకోవాల‌ని కూడా!





మరింత సమాచారం తెలుసుకోండి: