తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల స్పందించే తీరు పై ఇప్పుడు చాలావరకు విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేయడం మనం చూస్తున్నాము. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వైయస్ షర్మిల వాడుకోకుండా ఉండకూడదు. ఘాటుగా విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ షర్మిల అవసరమైన తరుణంలో పెద్దగా మాట్లాడక పోవడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా అలాగే మంత్రి కేటీఆర్ టార్గెట్గా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శ దెబ్బకు అధికార పార్టీలో కొంతమంది కంగారుపడ్డారు అనేక కామెంట్లు కూడా వినిపించాయి. మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో ఈ విమర్శలు కాస్త చల్లబడిన అంతకు ముందు మాత్రం మీడియా మొత్తం దాని మీదనే ఫోకస్ చేసింది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో దాదాపుగా సక్సెస్ అయ్యారు అనే భావన కొంత వరకు ఉంది.

అయితే షర్మిల ఘాటుగా వ్యాఖ్యలు చేయకపోవడం అసలు ఈ అంశం గురించే ఆమె మాట్లాడకపోవడం ఘాటుగా నడిచే తరుణంలో ఆమె దీక్షలు చేయాలను కోవడం దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా అనవసర పరిణామాలుగా కొందరు భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించడం లో తప్పు లేదు గానీ రాజకీయంగా బలపడే అవకాశం వచ్చినప్పుడు విమర్శలు చేయాల్సి ఉన్నా సరే ఆమె మాట్లాడక పోవడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మిల భవిష్యత్తులో ఎంత వరకు ఇటువంటి వాటిని వాడుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: