తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తూ ఘాటుగా విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లి పర్యటనలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కొన్ని కొన్ని విషయాల్లో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితిలో షర్మిల ప్రజల్లోకి వెళ్లాలి అలాగే మీడియాలో ఎక్కువగా హైలెట్ కావాలి అంటే కొన్ని కొన్ని విషయాల మీద ఘాటుగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. మీడియాలో హైలెట్ అయ్యేందుకు కొన్ని కామెంట్స్ ఆమె చేస్తే ఖచ్చితంగా వాటి ప్రభావం సోషల్ మీడియా మీద ఎక్కువగా ఉంటుంది.

ఇక వైయస్ షర్మిల ఇస్తున్న ఇంటర్వ్యూలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం అది ప్రసారం కానున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సదరు మీడియా ఛానల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.

చానల్ కు షర్మిల వెళ్లడం అ ఛానల్ అధినేతకు ఇంటర్వ్యూ ఇవ్వడం పట్ల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని వైఎస్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించే సదరు ఛానల్ విషయంలో షర్మిల ముందు నుంచి కూడా చాలా ఆసక్తి కరం గా ఉన్నారని అంటున్నారు. అసలు ఆమె ఇటువంటి వాటికి దూరంగా లేకపోతే మాత్రం తెలంగాణలో పార్టీని బలోపేతం అయ్యే అవకాశాలు ఉండవని వైఎస్ అభిమానులు కూడా దూరం కావచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: