క‌రోనా వైర‌స్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ మ‌హ‌మ్మారి ఎక్క‌డ‌.. ఎలా పుట్టింది అనేది ఇప్ప‌టికీ ఓ ర‌హ‌స్యంగానే ఉంది. గ‌బ్బిలాల నుంచి ఈ వైర‌స్ వ‌చ్చింద‌ని కొంద‌రు.. మ‌రోవైపు చైనా కృత్రిమంగా త‌న ల్యాబ్ నుంచి విడుద‌ల చేసింది అని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీని పై అనేక ప‌రిశోధ‌న‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చైనాను దోషిగా నిల‌బెట్టారు. అయితే, గబ్బిలాలకు కొవిడ్‌ వస్తుందా ?  వాటి ద్వారా మనుషులకు క‌రోనా సోకుతుందా అనేది అర్థం కాక అంద‌రినీ ఆగం చేస్తోంది. 


ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదంటున్న ప‌రిశోధ‌కులు మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని తెర మీద‌కు తీసుకు వ‌చ్చారు. క‌రోనా ర‌క్క‌సి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న స‌మ‌యంలో.. మ‌రో ఆందోళ‌న‌క‌ర అంశం ముందుకు వ‌చ్చింది. క‌రోనా పుట్టుక‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్న క్ర‌మంలో గ‌బ్బిలాల్లో మ‌రో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌ను గుర్తించారు ప‌రిశోధ‌కులు.  ఈ వైర‌స్ సార్స్ కోవి-2 ను పోలి ఉండ‌డంతో మ‌రింత టెన్ష‌న్ పెరుగుతోంది.


     ఫ్రాన్స్‌లోని పాశ్చ‌ర్ ఇనిస్టిట్యూట్‌, నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ లావోస్ శాస్త్ర‌వేత్త‌లు దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను తమ ప‌రిశోధ‌న‌ల్లో క‌నిపెట్టారు వీరు. ఈ వైర‌స్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న కొవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా పోలి ఉన్నట్లు తెలిపారు. క‌రోనా వైరస్‌కు అతిదగ్గరగా ఉన్న రెండో ర‌కం వైరస్ అని వెల్ల‌డించారు. అయితే, గ‌బ్బిలాల్లో ఉన్న క‌రోనా వైర‌స్ లు ఎన్ని.. వాటిల్లో మ‌నుషుల‌కు ఎన్ని సోకేందుకు అవ‌కాశం ఉంది.. అనే అంశంపై శాస్త్ర‌వేత్తలు ప‌రిశోధ‌న‌లు చేశారు.


   ఈ ప‌రిశోధ‌న‌ల‌కు చిన్న గ‌బ్బిళాలు, అలాగే గుహ‌ల్లో ఉండే గ‌బ్బిళాల మూత్రం, మ‌లంతో పాటు అవి నివ‌సించే ప్రాంతాల్లో నుంచి న‌మూనాల‌ను సేక‌రించారు.  విటి ప‌రిశీల‌న అనంత‌రం SARS-CoV-2 వైర‌స్‌లో ఉండే  జ‌న్యుప‌రంగా ద‌గ్గ‌ర‌గా ఉండే వైర‌స్‌ల‌ను ఆ గ‌బ్బిళాల్లో గుర్తించారు ప‌రిశోధ‌కులు. ఈ అధ్య‌యనంలో SARS-CoV-2, ఎలోయిట్ వైర‌స్‌లు మధ్య ప్ర‌ముఖ తేడాలు ఉన్నాయ‌ని గుర్తించారు.  కరోనా వైర‌స్ పుట్టుకకు ఉన్న మూలాన్ని గుర్తించ‌డంలో వీరి ప‌రిశోధ‌న‌తో కీల‌క ముండుగు ప‌డింద‌ని పేర్కొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిన కొవిడ్ సజీవ గ‌బ్బిలాల నుంచి వ‌చ్చి ఉండ‌వ‌చ్చనే సిద్దాంతాన్ని కొద్ది వ‌ర‌కు ధృవీక‌రిస్తున్నారు ప‌రిశోధ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: