ఆయన ఒక మంత్రి, రెండేళ్లుగా కరోనా పరిస్థితులు పూర్తిగా తెలిసిన వాడు. ఇటీవల రెండు మాస్కులు ధరించాలని నియమాల ప్రకారం ధరించాడు. కానీ ఎవరికో అసలు మాస్క్ లేకపోవడంతో ఒకటి తీసి అతడికి ఇచ్చేశాడు. ఇవ్వడం ఖచ్చితంగా తప్పు కాదు, కానీ అదెప్పుడు, తన దగ్గర మరొక వాడని మాస్క్ ఉన్నప్పుడు, ఇక్కడ ఇచ్చింది ఆయన వాడుతున్న రెండింటిలో ఒకటి తీసి ఇచ్చారు. కరోనా నిబంధనలు తెలిసి, మంత్రి అయిఉండి, ఇలాంటి పని చేసినందుకు ఆయనను నెటిజన్లు కొత్తగా సెలెబ్రిటీని చేసేశారు. అంటే ఆయన చేసిన పనిని వీడియో తీసి సామజిక మాధ్యమాలలో పెట్టేసి, ఇదేమి పని సారూ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒక్కోసారి అన్ని తెలిసిన వారు కూడా కనీస నియమాలు మరిచిపోయి ప్రవర్తించడం సహజం. అసలు తప్పులు చేయడం మానవ సహజం అనేది మనస్తత్వశాస్త్రం స్పష్టంగా చెపుతూనే ఉంది. బహుశా ఈ మంత్రివర్యులు చేసింది కూడా అందుకే కాబోలు అని కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు తెలిపినట్టుగా విమర్శలు చేస్తున్నారు. కేవలం నియమాలు పెట్టడం వరకే నేతల పని వాళ్ళు మాత్రం పాటించరు అనే కోణంలో కూడా విమర్శలు తారాస్థాయికి చేస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా ఒక ప్రముఖ వ్యక్తి ఏది చేసినా దానిని కొండంత చేసి చూపడం ఎవరికైన సహజం. ఇక్కడ కూడా అదే మంత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఇలాంటివి ప్రముఖులు చేసినప్పుడు ఎత్తి చూపడానికి సాంకేతికత ఉపయోగపడుతుంది. నిజానికి ఇలాంటివి జరిగిన వెంటనే సదరు వ్యక్తి స్పందించి, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో స్పష్టం చేస్తారు. ఈ మార్పు తేవడంలో సాంకేతికత బాగా ఉపయుక్తంగా ఉండటం మంచి పరిణామం. అయితే ఇది కాస్త శృతిమించకుండా చూసుకోవడం చాలా అవసరం. హద్దులు దాటితే ఎప్పుడైనా ప్రతికూల ఫలితాలు తప్పవు మరి. ఇదంతా ఆ మంత్రి బహిరంగ సభలో పాల్గొనటానికి వేసినప్పుడు చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు చిక్కడంతో ప్రభుత్వం పై ఒక స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం కరోనా కోసం కోట్లు ఖర్చుచేస్తున్నది కానీ, తమ మంత్రులకు వాడేసిన మాస్కులు పంచిపెడుతుంది అని విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: