ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాలని బట్టి రాజకీయ నాయకులు కూడా మారాలి. ఆ పరిస్తితులని బట్టి రాజకీయం చేయాలి...కానీ టి‌డి‌పి అధినేత చంద్రబాబు ఆ పని చేసేలా కనిపించడం లేదు. పేరుకు నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు గానీ, అందుకు తగ్గట్టుగా రాజకీయం చేయరు. ఇంకా బాబు ఓల్డ్ ఫార్మాట్‌లోనే రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
అంటే ఎప్పుడో 1990ల కాలంలో చక్రం తిప్పామని చెప్పి, అదే తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడు తన రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయని చెప్పి, ఇప్పుడు కూడా అవే వ్యూహాలు అమలు చేయడం వల్ల టి‌డి‌పి ఇంకా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే జగన్ దెబ్బకు పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇక డ్యామేజ్ నుంచి బయట పడవేయాల్సిన  బాధ్యత బాబుది. కానీ బాబు ఆ విధంగా పనిచేయరు.

ఎంతసేపు పాత వ్యూహాలతో ముందుకెళుతు బోరింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో ఇంకా పూర్తి స్థాయిలో పార్టీకి నష్టం జరిగింది. ఇంత జరిగినా కూడా బాబు మారడం లేదు. ఎంతసేపు మీడియాలోనో, సోషల్ మీడియాలోనో జగన్‌పై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. అది కూడా దూకుడుగా రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఎంతసేపు బోరింగ్ విమర్శలు చేస్తారు. దాని వల్ల ఆ విమర్శలు పట్టించుకోవాలని జనాలు అనుకోరు...ఆ విమర్శల వల్ల పార్టీకి లాభం జరిగేది కూడా ఏం ఉండదు.

ఎంతసేపు బోరింగ్ టైపులా రాజకీయం చేస్తారు. ఇలా చేయడం వల్ల పార్టీకి పావలా కూడా ఉపయోగం లేదు. అయినా సరే బాబు తన పంథా మార్చుకోవడం లేదు. పరిస్తితులని బట్టి రాజకీయాలని మార్చడం లేదు. ఎంతసేపు పాత తరహాలోనే రాజకీయం చేస్తున్నారు. దీని వల్ల పార్టీకి ఇంకా నష్టమే జరుగుతుంది తప్ప...లాభం అసలు జరగదు.

మరింత సమాచారం తెలుసుకోండి: